ఐకాన్ కూడా పాన్ ఇండియా కె
అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో తర్వాత సుకుమార్ పుష్ప సినిమాని పట్టాలెక్కించాడు. అయితే సుకుమార్ అప్పట్లో పుష్ప సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలని, తమిళ్ కి కనెక్ట్ [more]
అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో తర్వాత సుకుమార్ పుష్ప సినిమాని పట్టాలెక్కించాడు. అయితే సుకుమార్ అప్పట్లో పుష్ప సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలని, తమిళ్ కి కనెక్ట్ [more]
అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో తర్వాత సుకుమార్ పుష్ప సినిమాని పట్టాలెక్కించాడు. అయితే సుకుమార్ అప్పట్లో పుష్ప సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలని, తమిళ్ కి కనెక్ట్ అయ్యేలా కథ రాసుకున్నాడు. కానీ అల్లు అర్జున్ పుష్ప కథని పాన్ ఇండియా మార్కెట్ కి మార్చేశాడు. అల్లు అర్జున్ ప్రోద్బలంతోనే సుకుమార్ పుష్ప కథని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ పై సస్పెన్స్ కొనసాగుతున్నా.. ప్రస్తుతం దిల్ రాజు – వేణు శ్రీరామ్ ల ఐకాన్ మూవీ పై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టినట్లుగా మొన్నామధ్యన గీత ఆర్ట్స్ నుండి బన్నీ వాస్ చిన్న క్లారిటీ ఇచ్చాడు.
అయితే వేణు శ్రీరామ్ ఐకాన్ ని రెండు తెలుగు రాష్ట్రాలకు సరిపోయే లాగే కథని రాసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ కథని కూడా పాన్ ఇండియా లెవల్ కి మార్పులు చెయ్యమని అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు కూడా అల్లు అర్జున్ ప్లాన్ నే వర్కౌట్ చేయ్యాలని అనుకుంటున్నాడట. దానితో వేణు శ్రీరామ్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కి సరిపోయేలా ఐకాన్ కథలో మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. తేలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారట.