సమంత కి కరొననా?

ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా భయం మొదలయ్యింది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దానితో ఆయన [more]

;

Update: 2020-06-25 02:37 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా భయం మొదలయ్యింది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దానితో ఆయన ఫ్యామిలి కూడా టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ అని తేలగా బండ్ల గణేష్ కే పాజిటివ్ రావడంతో.. అయన కమ్యూనిటీలో ఉన్న నాగ సౌర్య ఫ్యామిలీతో ఫార్మ్ హౌస్ కి వెళ్లాడని ప్రచారం జరిగింది. అంతలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆమె భర్తకి కరోనా పాజిటివ్ రావడ అక్కినేని అభిమానుల్లో కలవడం మొదలయ్యేలా చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నాగార్జున ఫ్యామిలీకి దగ్గర అయినా శిల్ప రెడ్డి ఆమె భర్తకి కరోనా పాజిటివ్ అని తేలడం.. ఆమె తన భర్త తో పాటుగా హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ.. చికిత్స తీసుకుంటున్నట్టుగా ఆమె స్వయంగా వీడియో విడుదల చెయ్యడంతో అక్కినేని అభిమానులు షాకయ్యారు.

ఎందుకంటే శిల్ప రెడ్డికి అక్కినేని సమంత క్లోజ్ ఫ్రెండ్ కావడం.. తాజాగా సోషల్ మీడియాలో శిల్పా రెడ్డిని సమంత ముద్దుపెట్టుకున్న పిక్ ఒకటి వైరల్ అవడంతో.. సమంత ఆమె భర్త నాగ చైతన్య కి కూడా కరోనా వచ్చేస్తుందని భయంలో అక్కినేని ఫాన్స్ ఉంటే.. అసలు సమంత ఆమె భర్త చైతు టెస్ట్ చేయిచుకుంటే బావుంటుందని అంటున్నారు కొందరు. కానీ సమంత కి ఎలాంటి కోవిడ్ టెస్ట్ అవసరం లేదని. ఆమె ఇంట్లోనే భర్తతో గడుపుతుంది కానీ.. ఎవరిని కలవలేదని, శిల్పా రెడ్డిని సమంత ముద్దు పెట్టుకున్న ఫోటో ఎప్పటిదో ఇప్పటిది కాదని అంటున్నారు. ప్రస్తుతం సమంత తాను ఆరోగ్యంగానే వున్నానని చెప్పకనే చెప్పే ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Tags:    

Similar News