రామ్ చరణ్ కాదా.. మహేశా?

రామ్ చరణ్ RRR తర్వాత మరో మూవీకి కమిట్ కాకపోయేసరికి.. రామ్ చరణ్ లాక్ డౌన్ లో కథలు వింటున్నాడు… అదిగో ఆ దర్శకుడితో రామ్ చరణ్ [more]

Update: 2020-08-08 06:08 GMT

రామ్ చరణ్ RRR తర్వాత మరో మూవీకి కమిట్ కాకపోయేసరికి.. రామ్ చరణ్ లాక్ డౌన్ లో కథలు వింటున్నాడు… అదిగో ఆ దర్శకుడితో రామ్ చరణ్ నెక్స్ట్.. ఇదిగో రామ్ చరణ్ నెక్స్ట్  ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం.. నిన్నగాక మొన్న మైత్రి మూవీస్ వారు తమిళ దర్శకుడు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా రామ్ చరణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని.. ఆచార్య, RRR తరవాత రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ తో సినిమా చెయ్యొచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. లోకేష్ కథతో మెప్పిస్తే రామ్ చరణ్ లోకేష్ తో సినిమా పక్కా చేస్తాడనే టాక్ నడిచింది.

అయితే తాజాగా రామ్ చరణ్ తో కాదు.. మైత్రి మూవీస్ వారు లోకేష్ కనకరాజ్ తో మహేష్ బాబు హీరోగా మూవీ ప్లాన్ చేస్తున్నారంటూ మరో వార్త సోషల్ మీడియా కెక్కింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాని పరశురామ్ దర్శకత్వంలో చేస్తునందు. తదుపరి మూవీ రాజమౌళి తో ఉండొచ్చు అనే టాక్ ఉండగా.. ఇప్పుడు కొత్తగా మైత్రి క్రియేషన్స్ వారు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు తో సినిమా చేస్తున్నది మహేష్ బాబుతో అంటూ న్యూస్ ప్రచారం లోకొచ్చింది. మైత్రి వారు లోకేశ్ కనగరాజ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అది మహేష్ కోసమే అని ప్రచారం జరుగుతుంది. మరి నిన్న రామ్ చరణ్ పేరు, నేడు మహేష్ పేరు, రేపు ఏ హీరో పేరు మైత్రి – లోకేష్ కనకరాజ్ ల కాంబోలో వచ్చి చేరుతుందో చూడాలి.

Tags:    

Similar News