అవినాష్ ని దెబ్బేసిన జబర్దస్త్ టీం!
అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 నుండి గత రాత్రి ప్రేక్షకుల ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్. ఎవిక్షన్ పాస్ వలన అవినాష్ బిగ్ బాస్ [more]
;
అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 నుండి గత రాత్రి ప్రేక్షకుల ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్. ఎవిక్షన్ పాస్ వలన అవినాష్ బిగ్ బాస్ [more]
అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 నుండి గత రాత్రి ప్రేక్షకుల ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్. ఎవిక్షన్ పాస్ వలన అవినాష్ బిగ్ బాస్ లో ఉన్నాడు.. లేదంటే మనోడు ఈపాటికి బయట ఉండేవాడు. ఎవిక్షన్ పాస్ వలన నేను ఈ హౌస్ లో ఉన్నా కానీ.. ప్రేక్షకుల చేతిలో ఓడిపోయా అంటున్న అవినాష్ ని జబర్దస్త్ కమెడియన్స్ కూడా బాగా దెబ్బేసారు. అవినాష్ ని సపోర్ట్ చేస్తూనే మరో బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కప్ గెలవాలని విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు. అవినాష్ కి మద్దుతు తెలుపుతూనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఇప్పటివరకు స్టేబుల్ గా ఆడుతున్న అభిజిత్ కి కూడా మద్దతు తెలుపుతున్నారు.
రాకింగ్ రాకేష్, గెటప్ శ్రీనులు అవినాష్ ని గెలిపించమని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ భాస్కర్ లాంటి కమెడియన్స్ అవినాష్ గెలిస్తే బావుంటుంది.. కానీ అవినాష్ కి గెలిచే ఛాన్సెస్ తక్కువ కాబట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా అభిజిత్ కి ఓట్స్ వెయ్యమని కోరడం చూస్తే అవినాష్ కి తాను నమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్స్ బాగా దెబ్బేసారనిపిస్తుంది. అవినాష్ కి మా సపోర్ట్ ఉంటుంది అని చెబుతూనే అభిజిత్ కి ఓట్స్ వెయ్యండి గెలిపించండి అంటే ఏమనుకోవాలి.