పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ బ్యూటీ.. నెట్టింట్లో పిక్స్ వైరల్ !
రియాలిటీ షో లో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత బుల్లితెరలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది.;
పెళ్లిచూపులు రియాలిటీ షో తో బుల్లితెరపై సందడి చేసిన యువనటి షబీనా షేక్. రియాలిటీ షో లో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత బుల్లితెరలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. నా పేరు మీనాక్షి, అత్తారింటికి దారేది, కస్తూరి ఇలా పలు సీరియళ్లలో పాజిటివ్, నెగిటివ్ రోల్స్ లో నటించి ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది షబీనా. ఇటీవల కాలంలో జబర్దస్త్ లోనూ తన కామెడీ టైమింగ్ అదరగొట్టేస్తోంది.
కెవ్వు కార్తీక్ టీమ్ లో ఆమె కామెడీ టైమింగ్ కు చాలా మంది అభిమానులే ఉన్నారు. ఈ బ్యూటీ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుందట. అందుకు సంబంధించిన ఫొటోలను షబీనా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. షబీనా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.