Jabardasth Faima : హాస్పిటల్ బెడ్‌పై జబర్ధస్త్ ఫైమా.. ఏమైంది..?

హాస్పిటల్ బెడ్‌పై జబర్ధస్త్ ఫైమా. చేతికి సెలైన్‌తో అనారోగ్యంతో..;

Update: 2023-11-25 14:28 GMT

Jabardasth Faima : జ‌బ‌ర్ధ‌స్త్ ఫైమా అంటే గుర్తు పట్టని వారుండరేమో. 'పటాస్' కామెడీ షోకి ఆడియెన్‌గా వెళ్లి అక్కడ కంటెస్టెంట్ గా అవకాశం అందుకొని.. తన పర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తరువాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ తనదైన డైలాగ్ డెలివరీతో పంచ్‌లు వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీని అందుకుంది. ఇక అక్కడి నుంచి బిగ్‌బాస్‌కి వెళ్ళింది.

గత సీజన్ లో కంటెస్టెంట్ గా బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. దాదాపు 10 వారాల హౌస్ లో కొనసాగింది. ఇక బిగ్‌బాస్‌ ద్వారా మరింత ఫేమ్ ని సంపాదించుకుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఫైమా.. ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకొని తన కోరిక‌ను నెర‌వేర్చుకుంది. దీంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది అనుకుంటే.. ఇప్పుడు సడన్ గా హాస్పిటల్ బెడ్ పై కనిపించి అందర్నీ షాక్ కి గురి చేసింది.
Full View
రీసెంట్ గా ఫైమా తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఫైమా.. హాస్పిటల్ బెడ్ చికిత్స తీసుకుంటూ కనిపిస్తుంది. చేతికి సెలైన్‌తో అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తూ ఫైమా ఇలా రాసుకొచ్చింది. "నా గతమంతా నే మరిచానే" అంటూ ఫైమా కామెంట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆమెకు ఏమైందని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఫైమా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఆ ఛానల్ లో రెగ్యులర్ గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఆడియన్స్ ని నిత్యం పలకరిస్తుంటుంది. రీసెంట్ గా ఒక రోజు క్రిందట కూడా ఒక వీడియో షేర్ చేసింది. అయితే ఇంతలోనే ఆమెకు ఏమైందని అందరూ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఏమైనా గాని త్వరగా  కోలుకోవాలని కోరుకుంటున్నారు.



Tags:    

Similar News