ఇటలీకి పవన్ కళ్యాణ్

తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి;

Update: 2023-10-28 07:16 GMT
Varuntej, LavanyaTripathi, Italy, pawankalyan, megawedding, wedding
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటలీకి బయల్దేరారు. తన భార్యతో కలిసి ఆయన ఇటలీకి వెళ్లనున్నారు. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరుగుతూ ఉంది. నవంబర్ 1న మెగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి హాజరవడానికి పవన్ ఇటలీకి బయల్దేరారు. ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్ ఇటలీకి వెళ్లకపోవచ్చనే ప్రచారం సాగింది. అయితే పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ శుభలేఖకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు ఉన్నాయి. దాని కింద భాగంలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను ముద్రించారు. నవంబర్‌ 1న ఇటలీలోని టుస్కానీలో జరగనుండగా రిసెప్షన్‌ మాత్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో రిసెప్షన్‌ ఉంటుందని శుభలేఖలో తెలిపారు.


Tags:    

Similar News