కమ్ముల డేరింగ్ స్టెప్!!
శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చాలా రోజులకి నాగ చైతన్య – సాయి పల్లవిలతో కలిసి లవ్ స్టోరీ మొదలు పెట్టాడు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ [more]
;
శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చాలా రోజులకి నాగ చైతన్య – సాయి పల్లవిలతో కలిసి లవ్ స్టోరీ మొదలు పెట్టాడు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ [more]
శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చాలా రోజులకి నాగ చైతన్య – సాయి పల్లవిలతో కలిసి లవ్ స్టోరీ మొదలు పెట్టాడు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడం, అలాగే థియేటర్స్ బిజినెస్ తో పాటుగా, ఓవర్సీస్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోవడంతో.. లవ్ స్టోరీ టీం మొత్తం హ్యాపీగానే ఉంది. లవ్ స్టోరీ లోని ఓ సాంగ్ కూడా టాప్ ట్రేండింగ్ లోకి రావడంతో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే కరోనా లాక్ డౌన్ వలన ఏప్రిల్ లో విడుదల కావాల్సిన లవ్ స్టోరీ మరో 15 రోజులు షూటింగ్ పూర్తి చేసుకుంటే.. లాక్ డౌన్ ముగిసి థియేటర్స్ ఓపెన్ కాగానే విడుదల చేస్తాడు శేఖర్ కమ్ముల అనుకున్నారు. మధ్యలో లవ్ స్టోరీకి అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లు తమ అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వమని నిర్మాతని ఒత్తిడి చేసినట్టుగా కూడా వార్తలొచ్చాయి.
అయితే శేఖర్ కమ్ముల ఓటిటి వాళ్ళు ఇచ్చే భారీ ఆఫర్స్ కి టెంప్ట్ అవ్వకుండా తమ సినిమాని థియేటర్స్ లో దింపుతామని, త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టి.. ఆ 15 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తామని., ఈ 15 రోజుల్ షూటింగ్ లోనే ఓ రెండు సాంగ్స్ చిత్రీకరణ ఉందని.. అయితే షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరిగితే.. సినిమాని ఈ ఏడాది విడుదల చేసేస్తారేమో అనుకుంటే.. కాదు ఈ ఏడాది లవ్ స్టోరీ విడుదల ఉండదు. వచ్చే ఏడాది సంక్రాంతికి లవ్ స్టోరీని బాక్సాఫీసు బరిలో వదలాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. పెద్ద సినిమాలు పండగ బరిలో ఉన్న శేఖర్ ఖమ్ముల్ సినిమాకి స్పెషల్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి శేఖర్ కమ్ముల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఈ ఏడాది కరోనా ముగిసి థియేటర్స్ ఓపెన్ అయినా సినిమాని హడావిడిగా విడుదల చెయ్యడమెందుకు అని డేరింగ్ గా సంక్రాంతికే దింపాలని కమ్ముల డిసైడ్ అయ్యాడట.