మొన్నటివరకు ‘మణికర్ణిక’ సినిమాను ఎవరు డైరెక్ట్ చేశారో తెలియక సతమతమవుతున్న మనకి ఒక క్లారిటీ వచ్చేసింది. అసలు సినిమాలో క్రిష్ పేరు వేస్తారా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. ‘మణికర్ణిక’ 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత డైరెక్టర్ క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని ఎన్టీఆర్ బయోపిక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు హీరోయిన్ కంగనా రనౌత్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకుని మిగిలిన సినిమాను కంప్లీట్ చేసిందని చెప్పారు. అంతేకాదు క్రిష్ డైరెక్ట్ చేసిన కొన్ని కీలక సీన్స్ ను కంగనా రీషూట్ చేసిందని సమాచారం. దీంతో అంతా అసలు ఈ సినిమాలో డైరెక్టర్ గా క్రిష్ పేరు వేయరు అనుకున్నారు.
70 శాతం తనదేనన్న కంగనా
కానీ నిన్న రిలీజ్ అయిన ‘మణికర్ణిక’ ట్రైలర్ చివర్లో దర్శకత్వం కింద క్రిష్ పేరుతో పాటు కంగనా పేరు కూడా వేశారు. మంగళవారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కంగనా మాట్లాడుతూ... కీలకమైన వార్ ఎపిసోడ్లతో పాటుగా 70 శాతం సినిమాను తానే డైరెక్ట్ చేసినట్లు కంగనా వెల్లడించి అందరినీ షాక్ కి గురిచేసింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయినా ఈ సినిమా తాలూకు క్రెడిట్ అంతా అతడికే దక్కుతుందని, తనకు క్రెడిట్స్ ఏమీ అక్కర్లేదని చెప్పింది. ఈ సినిమాకి కథను రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందించారు. మరి కంగనా క్రిష్ గాలి తీసేసినా క్రిష్ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నాడో ఎవరికీ అర్ధం కానీ విషయం. ఈ సినిమాకి 30 శాతం మాత్రమే క్రిష్ డైరెక్ట్ చేస్తే అతడిని ఎవరు దర్శకుడిగా గుర్తిస్తారు..? కాబట్టే క్రిష్ మాట్లాడట్లేదని తెలుస్తుంది.