ఆ సింగర్ ని వదలని కరోనా కష్టాలు!!

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ వలన అటు పోలీస్ శాఖ ఇటు హాస్పిటల్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. లండన్ నుండి వచ్చి క్వారంటైన్ లో ఉండకుండా [more]

;

Update: 2020-03-30 04:57 GMT

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ వలన అటు పోలీస్ శాఖ ఇటు హాస్పిటల్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. లండన్ నుండి వచ్చి క్వారంటైన్ లో ఉండకుండా పార్టీలంటూ హడావిడి చేసి కరోనా పాజిటివ్ వచ్చిన కనికా కపూర్ ని లక్నో హాస్పిటల్ వైద్యులు ట్రీట్మెంట్ లో ఉంచారు. కరోనా వచ్చినా బుద్దిరాని కనికా కపూర్ హాస్పిటల్ సిబ్బందిని కూడా ఆడుకుంది. కనికా కరోనా పేషేంట్ లా వ్యవహరించడం లేదని డాక్టర్స్ నెత్తి నోరు కొట్టుకున్నారు. అయితే కనికా కపూర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదని అంటున్నారు.

కనికా కపూర్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఆమెకి పదే పదే కరోనా టెస్ట్ లు చేరిన ఆమెకి వరసగా పాజిటివ్ అనే తేలుతుందని.. ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగవడం లేదని అంటున్నారు. ఒకటి కాదు రెండు అక్కడు ఏకంగా కనికా కపూర్ కి నాలుగుసార్లు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా చెబుతున్నారు. కనికా కపూర్ ట్రీట్మెంట్ కి స్పందించడం లేదని.. ఆమె కుటుంబ సభ్యలు చెబుతున్నారు. మరి కనికా కపూర్ ముందే క్వారంటైన్ కి వెళ్ళినట్లైతే ఆమెకి ఈ దుస్థితి వచ్చేది కాదని అంటున్నారు. కానీ కనికా కపూర్ క్వారంటైన్ తప్పించుకోవడానికి చాలా డ్రామాలు చేసింది. చివరికి ఆమె ని కరోననే ఆడుకుంటుంది.

Tags:    

Similar News