అంత తిన్నా… ఎంత నాజూగ్గా ఉంటుంది!!

ఫ్యాట్ ఉన్న ఆహారం తింటే లావైపోతారు… ఐస్ క్రీం తిన్నా, పలావ్ తిన్నా లావైపోతారు. అందుకే డైట్ అంటారు చాలామంది. ఇక హీరోయిన్స్ అయితే చాలా నాజూగ్గా [more]

;

Update: 2020-08-19 06:47 GMT

ఫ్యాట్ ఉన్న ఆహారం తింటే లావైపోతారు… ఐస్ క్రీం తిన్నా, పలావ్ తిన్నా లావైపోతారు. అందుకే డైట్ అంటారు చాలామంది. ఇక హీరోయిన్స్ అయితే చాలా నాజూగ్గా ఉండడానికి కారణం వాళ్ళు ఫ్యాట్ ఫుడ్ అలాగే బరువు పెంచే ఆహారం తినరు. వారికి నచ్చిన ఫుడ్ కూడా తినడానికి లేదు.. పాపం హీరోయిన్స్ అనుకుంటారు అందరూ.. కానీ బాలీవుడ్ కి జీరో సైజు ని పరిచయం చేసిన కరీనా కపూర్ మొదటి సినిమా అప్పుడు ఎలా ఉందొ.. పెళ్ళై పిల్లాడిని కని.. మల్లి సినిమాలు చేస్తున్నా ఇప్పటికి అదే నాజూకు తనం, అదే మెయింటినెన్స్. పిల్లడు పుట్టిన బరువు పెరగని కరీనా కపూర్ అసలు ఫుడ్ తినదేమో అందుకే అలా ఉంది అనుకుంటే పొరబాటే.

ఎందుకంటే కరీనా కపూర్ తినే డైట్ చూస్తే ఒళ్ళు రావడం ఖాయమే మరి. ఉదయం తొమ్మిది గంటలకి నానా బెట్టిన బాదాం లేదా ఓ అరిటి పండు, మధ్యాన్నం 12 గంటలకి పెరుగు అన్నం, అప్పడం లేదా పన్నీర్ కర్రీ, రోటి, మధ్యాన్నం రెండు గంటలకి బొప్పాయి పండు,  వేరు సెనగలు, చిన్న సైజు చీజ్ ముక్క. సాయంత్రం 5 గంటలకి మామిడి లేదా లిచ్చి మిల్క్ షేక్, రాత్రి 8 గంటలకి భోజనంలో పలావ్, పాలక్ రోటి లేదా రైతా పప్పు అన్నం, కూర. నిదరపోయే ముందు పసుపు వేసిన పాలు తాగడం కరీనా డైట్ సీక్రెట్ అంట. మరి మధ్య మధ్యలో ఆకలేస్తే తాజా పళ్ళు తీసుకుంటుందట కరీనా. అంటే సన్నబడాలంటే తినడం మానెయ్యడం కాదు, మంచి డైట్ తీసుకుంటూనే వర్కౌట్స్ చెయ్యాలన్నమాట.

Tags:    

Similar News