దేవ్ ని యాక్సెప్ట్ చేస్తారా..?

తెలుగులో ఆవారా’, ‘నా పేరు శివ’ లాంటి సినిమాలతో పరిచయమైన అయిన తమిళ నటుడు కార్తీకి మధ్యలో కొంత మార్కెట్ తగ్గిన మాట వాస్తవమే. కానీ నాగార్జునతో [more]

Update: 2019-01-28 06:45 GMT

తెలుగులో ఆవారా’, ‘నా పేరు శివ’ లాంటి సినిమాలతో పరిచయమైన అయిన తమిళ నటుడు కార్తీకి మధ్యలో కొంత మార్కెట్ తగ్గిన మాట వాస్తవమే. కానీ నాగార్జునతో ‘ఊపిరి’ అనే సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఖాకి సినిమాతో మార్కెట్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం కార్తీ తమిళంలో దేవ్ అనే సినిమా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్ చాలా డీసెంట్ గా ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా సినిమా సాంగ్స్ రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు.

కొత్త దర్శకుడి దర్శకత్వంలో…

ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ‘దేవ్’ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. నిజానికి ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. జీవితంలో ఎప్పుడూ రాజీ పడకూడదని.. గుంపులో గోవిందా అన్నట్లు బతకొద్దని.. మనసుకు నచ్చింది చేయమని చెప్పే దేవ్ పాత్రలో కార్తీ కనిపించనున్నాడు. మరి దేవ్ పాత్రను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. కొత్త దర్శకుడు రజత్ రవిశంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. హారీష్ జయరాజ్ సంగీతం అందించాడు.

Tags:    

Similar News