బిగ్ బాస్ సీజన్ 2 ముగిసి రెండు నెలలు కావొస్తుంది. కానీ బిగ్ బాస్ వార్తలు మాత్రం ఇంకా అక్కడడక్కడ మీడియాలో వినబడుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ లో చాలామంది హౌస్ నుండి బయటికొచ్చాక కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. శ్యామల, సామ్రాట్, తనీష్, సునయన వంటి వారు పార్టీలు, ఫిలిం ఈవెంట్స్ లో కలుస్తూనే ఉన్నారు. అయితే హౌస్ లో ఉన్నవాళ్లలో మాత్రం తనీష్ తన రంగు సినిమా ప్రమోషన్స్ తో మీడియాతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నాడు. ఇక శ్యామల అయితే యాంకరింగ్ లో దూసుకుపోతుంది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక శ్యామలకి యాంకరింగ్ అవకాశాలు పెరిగాయి. ఇక బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మాత్రం తానూ హౌస్ లోనూ ఒంటరినే బయట ఒంటరినే అన్న పద్ధతి మాత్రం మానలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఒంటరిని అనే ఫీలింగ్ కల్పించి బయట కౌశల్ ఆర్మీ అంటూ ఫాన్స్ ని ఏర్పాటు చేసుకున్న కౌశల్ విన్నర్ గా బయటికొచ్చాక పలు ఛానల్స్ లో గొప్పలు పోయాడు.
అవన్నీ ఫేక్ అని చెప్పిన కౌశల్
తాను బంధాల కోసం బంధుత్వాల కోసం బిగ్ బాస్ హౌస్ కి వెళ్లలేదని.. తన లక్ష్యం వేరని చెప్పాడు. ఇక పలు ఛానల్స్ లో తనని హౌస్ మేట్స్ అంతా ఒంటరిని చేశారని.. బయటికొచ్చాక తనని ఎవరు కాంటాక్ట్ కూడా చెయ్యలేదని చెప్పుకొచ్చాడు. అంతేనా తనకి డాక్టరేట్ ఇస్తున్నారని.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం తన పేరును తీసుకుంటున్నారని.. ప్రధాని కార్యాలయం నుండి తనకి ఫోన్ వస్తే తాను అందుబాటులో లేకపోతె తన తండ్రి మాట్లాడాడని చెప్పాడు. తనకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయన్నాడు. అయితే కౌశల్ చెప్పినవన్నీ ఫేక్ అని మొన్నీమధ్యనే తెలియగా.. తాజాగా కౌశల్ కూడా తాను చెప్పినవాటిలో నిజం లేదని తాను మాత్రం అవి నిజమని నమ్మి మోసపోయానని చెప్పుకొచ్చాడు.
ఆ వార్త కూడా అబద్ధమేనా...?
ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన వాటికి సమాధానం చెబుతూ... గిన్నిస్ బుక్ రికార్డ్, డాక్టరేట్, పీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన ఫోన్ కాల్స్ ఫేక్ అని తనకి తెలిసిందని.. తన సతీమణి నీలిమ తనకు ముందే చెప్పినా.. తాను అన్ని పాజిటివ్ గా తీసుకుని... నమ్మి మోసపోయానని ఒప్పేసుకున్నాడు. మరి ఈ లెక్కన బోయపాటి సినిమాలో కౌశల్ కి విలన్ ఛాన్స్ అనే న్యూస్ కూడా రూమర్ అయ్యుండొచ్చు.