వరుసగా నాలుగు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ‘అల్లుడు శీను’, ‘జయ జానకి నాయక’ మంచి టాక్ దక్కించుకున్నా వసూళ్లపరంగా హిట్ కాలేకపోయాయి. ఇక రీసెంట్ గా ‘సాక్ష్యం’తో డిజాస్టర్ అందుకున్న శ్రీనివాస్ అయినా ఏమీ తగ్గకుండా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. త్వరలోనే మన ముందుకు రెండు సినిమాలతో రానున్నాడు. మొదట పోలీస్ ఆఫీసర్ పాత్రలో 'కవచం' అనే సినిమాతో పలరించబోతున్నాడు. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల చేశారు.
రీషూట్ చేస్తున్నారా..?
డిసెంబరు 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తుంది. డిసెంబరు 7న కాదు అసలు ఈ నెల మొత్తంలో ఈ సినిమా రిలీజ్ అవ్వదంట. జనవరిలో వద్దాం అంటే సంక్రాంతి రేస్ లో పెద్ద సినిమాలు ఉన్నాయి. కాబట్టి జనవరి నెలాఖరుకో, ఫిబ్రవరికో తప్ప మళ్లీ డేటు దొరకడం కష్టం. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు కానీ సడన్ గా ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్ధం కావట్లేదు. కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఈ సినిమా కాకుండా తేజ డైరెక్షన్ లో కాజల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.