చిరు కోసమా? మనీ కోసమా?

మహానటి కీర్తి సురేష్ మీద అభిమానులు ఫైర్ అవుతున్నారు.కీర్తి సురేష్ అనవసరంగా కెరీర్ ని పాడు చేసుకుంటుంది. మహానటి కోసం అంటే బరువు పెరిగి కెరీర్ లో [more]

;

Update: 2020-10-30 09:34 GMT

మహానటి కీర్తి సురేష్ మీద అభిమానులు ఫైర్ అవుతున్నారు.కీర్తి సురేష్ అనవసరంగా కెరీర్ ని పాడు చేసుకుంటుంది. మహానటి కోసం అంటే బరువు పెరిగి కెరీర్ లో కాస్త డల్ అయినా మల్లి స్టార్ హీరోల ఛాన్స్ లు పట్టుకున్న టైం లో చిరంజీవి కి చెల్లెలి కేరెక్టర్ లో వేదాళం రీమేక్ లో ఎందుకు నటించడం అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కీర్తి సురేష్ ని ఆడుకుంటున్నారు. మెహెర్ రమేష్ డైరెక్ట్ చెయ్యబోయే వేదాళం రీమేక్ లో కీర్త్ సురేష్ చిరు చెల్లెలిగా ఫిక్స్ అయ్యింది అని.. కీర్తి సురేష్ ని సంప్రదించిన మూవీ టీం కి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది.

అయితే కీర్తి సురేష్ చెల్లెలి కేరెక్టర్ ఎందుకు ఒప్పుకుంది. అది చిరంజీవి సినిమా కాబట్టి ఆయనతో యాక్ట్ చెయ్యడం ఇంట్రెస్ట్ కాబట్టి ఒప్పుకుందా? లేదంటే వేదాళం రీమేక్ లో చెల్లెలిగా నటించేందుకు నిర్మాత బాగా రెమ్యునరేషన్ ముట్ట జెబుతున్నారా? ఎందుకు ఈ సినిమా ఒప్పుకుని కీర్తి రిస్క్ చేస్తుంది.. అసలు కెరీర్ లో స్టార్ ఛాన్సెస్ రావడమే కష్టం. అలాంటిది మహేష్ సర్కారు వారి పాటలో ఛాన్స్ వచ్చింది. అలాంటి టైం లో చెల్లెలి కేరెక్టర్ ఒప్పుకుని కెరీర్ ని నాశనం చేసుకోవడం తప్ప మరేమి లేదు.. పారితోషకం కోసం అయితే ఇలాంటి రిస్క్ అవసరం లేదు అంటున్నారు కీర్తి అభిమానులు. మరి కీర్తి సురేష్ అభిమానుల బాధను చేసుకుంటుందో.. లేదంటే.. మరేదన్నానో చూడాలి.

Tags:    

Similar News