తెలుగు సినిమాల విషయంలో జాగ్రత్తలు..!

కొరటాల డైరెక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ నటి కియరా అద్వానీ తన తొలి సినిమాతోనే స్టార్ హీరో మహేష్ బాబుతో [more]

;

Update: 2019-01-25 08:51 GMT
kiara advani in kabir singh movie
  • whatsapp icon

కొరటాల డైరెక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ నటి కియరా అద్వానీ తన తొలి సినిమాతోనే స్టార్ హీరో మహేష్ బాబుతో చేసే ఛాన్స్ కొట్టేసింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ లో నటించే అవకాశం వచ్చింది. దీంతో టాలీవుడ్ లో ఆమె జోరు కొనసాగడం ఖాయమని చెప్పుకున్నారు. ‘వినయ విధేయ రామ’ హిట్ అయ్యి ఉంటే అదే జరిగేది. కానీ డిజాస్టర్ అవడంతో ఆమె పెట్టుకున్న ఆశలన్నీ నీరు గారిపోవడంతో కియరా అద్వానీ బాగా అప్సెట్ అయిందట.

ఇక నుంచి జాగ్రత్తగా…

ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయేదే. కానీ అలా జగరలేదు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నాడు.

Tags:    

Similar News