గాలి కుమారుడు ఎంట్రీ... త్వరలోనే ముహూర్తం షాట్

మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరిటి రెడ్డి త్వరలో మూవీ హీరోగా ఎంటర్ కాబోతున్నారు.;

Update: 2022-01-06 03:54 GMT

గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరిటి రెడ్డి త్వరలో మూవీ హీరోగా ఎంటర్ కాబోతున్నారు. కిరీటితో సాయి కొర్రపాటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కిరీటికి తొలినుంచి సినిమారంగంలోకి ప్రవేశించాలన్న కోరిక ఉందని కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తెలిపారు. ఆయన యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నట్లు కూడా తెలతిపారు.

కన్నడ, తెలుగులో....
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇన్సిపిరేషన్ తో సినిమారంగంలోకి కిరీటి ప్రవేశించనున్నారు. గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో కోట్లు గడించారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల నేతలతో మంచి పరిచయాలున్నాయి. కన్నడ నాట రాజకీయాల్లో గాలి జనార్థన్ రెడ్డి కీ రోల్ పోషించారు. కిరీటి రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై గాలి జనార్థన్ రెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News