శ్రీను వైట్ల అంతలా అవమానించాడా?

శ్రీను వైట్ల ప్రస్తుతం డిజాస్టర్ డైరెక్టర్. ఒకప్పుడు దూకుడు, ఢీ, బాదుషా లాంటి సూపర్ హిట్ ఫిలిమ్స్ తీసిన శ్రీను వైట్లకి ప్రస్తుతం అవకాశం ఇచ్చే నాధుడే [more]

;

Update: 2020-04-02 07:14 GMT
శ్రీను వైట్ల అంతలా అవమానించాడా?
  • whatsapp icon

శ్రీను వైట్ల ప్రస్తుతం డిజాస్టర్ డైరెక్టర్. ఒకప్పుడు దూకుడు, ఢీ, బాదుషా లాంటి సూపర్ హిట్ ఫిలిమ్స్ తీసిన శ్రీను వైట్లకి ప్రస్తుతం అవకాశం ఇచ్చే నాధుడే లేదు. అయితే ఒకప్పుడు సూపర్ హిట్ డైరెక్టర్ అయిన శ్రీను వైట్ల హిట్ లో సగభాగం రచయిత కోన వెంకట్ దే. కోన వెంకట్ కథకి శ్రీను వైట్ల మేకింగ్ స్టయిల్ తో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే కోన వెంకట్ శ్రీను వైట్ల దగ్గరనుండి బయటికెళ్ళాక శ్రీను వైట్లకి సక్సెస్ అనేదే లేదు. కానీ కోన మాత్రం శ్రీను కి దగ్గరవ్వలేదు. వారి మధ్యన తీవ్ర విభేదాలు ఉన్న కారణంగానే ఎవరికీ వారు సినిమాలు చేసుకుంటున్నారని టాక్ మొదలైంది.

Sreenu Vaitla film with manchu vishnu

అయితే తాజాగా కోన వెంకట్ శ్రీను వైట్లకి ఎందుకు దూరమయ్యాడో చెప్పాడు. తాను పది డైలాగ్స్ రాస్తే.. అందులో శ్రీను వైట్ల ఓ డైలాగ్ సెలెక్ట్ చేసుకుని.. ఇంకా దానికి మెరుగులు దిద్దుకుని వాటిని తీసుకుని.. ఆ తర్వాత క్రెడిట్ మొత్తం తానె తీస్కోవడం మొదలు పెట్టాడని.. అందుకే తాను శ్రీను వైట్లకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. నేను రాసిచ్చిన డైలాగ్స్ ని కొంచెం బెటర్ చేసేసుకుని.. క్రెడిట్ మొత్తం తనదే అని ఫీలయ్యేవాడని…. అది తనకి అవమానంగా భావించే శ్రీనుకి దూరమయ్యా అంటున్నాడు. ఇక శ్రీను వైట్ల కూడా మంచి డైరెక్టర్ అని.. కొన్ని విషయాల్లో నా కథ హైలెట్ అయితే మరికొన్ని విషయాల్లో శ్రీను వైట్ల దర్శకత్వం స్టయిల్ వలన సినిమాలు హిట్ అయ్యేవని.. త్వరలోనే అన్ని అనుకూలిస్తే ఇద్దరం కలిసి మళ్ళీఆపనిచేస్తామంటూ చెప్పాడు కోన వెంకట్.

Tags:    

Similar News