లక్ష్మీస్ ఎన్టీఆర్ మళ్ళీ వాయిదా?

అదేమిటి ఎలక్షన్ కమీషన్ నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేసుకోవచ్చని.. చెప్పాక కూడా లక్షిస్ ఎన్టీఆర్ వాయిదా ఏమిటి అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మ ఎలాగైనా ఎన్నికల [more]

Update: 2019-03-17 05:10 GMT

అదేమిటి ఎలక్షన్ కమీషన్ నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేసుకోవచ్చని.. చెప్పాక కూడా లక్షిస్ ఎన్టీఆర్ వాయిదా ఏమిటి అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మ ఎలాగైనా ఎన్నికల వేడిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని దింపి క్యాష్ చేసుకోవాలన్నా.. దానికి మించి బాలయ్య, టిడిపి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే తన సినిమా ఎక్కడ రానివ్వరో అని.. సినిమాలోని కీలక సన్నివేశాలను లీక్ చేసి మరీ ఆనందం పొందుతున్నాడు. ఇక వచ్చే వారం అంటే రేపు శుక్రవారం మార్చ్ 22 న విడుదల తేదీ ప్రకటించడం, మధ్యలో ఎన్నికల టైం లో సినిమా విడుదల ఏమిటంటూ… ఈసీ దగ్గర సినిమా నిలిపి వేయాలంటూ.. కోరడం, ఈసీ ఏమో.. సినిమా విడుదలకు ముందు మేము ఏం చెయ్యలేం.. విడుదలయ్యాక ఆ సినిమా విషయంలో తేడా అనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం, దేనికి బెదరని వర్మ ఏది ఏమైనా తన సినిమాని రిలీజ్ చేస్తానంటూ.. బెదిరించడం ఇలా హాట్ హాట్ గా కనబడుతున్న వ్యవహారంలో సినిమా విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.

కానీ తాజాగా సమాచారం ప్రకారం లక్షిస్ ఎన్టీఆర్ మార్చ్ 22 న రావడం లేదనే టాక్ వినబడుతుంది. ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని టాక్ బయటికొచ్చింది. సినిమావిడుదలకు కేవలం ఐదు రోజులే ఉండడం.. ఇంతవరకు సినిమాకి సెన్సార్ కాకపోవడం చూస్తుంటే.. సెన్సార్ వారు అంత తొందరగా…. సినిమాకి క్లియరెన్స్ ఇచ్చేలా కనబడడం లేదు. ప్రస్తుతం మంచి ప్రమోషన్స్ తో భారీ హైప్ ఉన్న సినిమా లక్షిస్ ఎన్టీఆర్ విడుదల ఆపడానికి నందమూరి ఫ్యామిలీ నుండి ఎటువంటి అడ్డంకులు పెట్టడం లేదు, అలాగే టిడిపి కార్యకర్తలు కూడా పెద్దగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని పట్టించుకున్నట్లుగా కనబడ్డం లేదు కానీ.. సెన్సార్ వారు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఒక నొక్కు నొక్కేలా కనబడుతుంది వ్యవహారం. అయితే మార్చ్ 22 నుండి ఈ సినిమా మార్చ్ 29 కి పోస్ట్ పోనే అయ్యేలా ఉంది వ్యవహారం. అయితే మార్చ్ 22 న సెన్సార్ కాకపోతే మార్చ్ 29 కి మార్చే ఆలోచనలో వర్మ ఉన్నాడట. కానీ ఈలోపే సెన్సార్ నుండి లైన్ క్లియర్ చెయ్యాలని వర్మ తో పాటుగా నిర్మాత కూడా నానా తంటాలు పడుతున్నాడట.

Tags:    

Similar News