షాకిచ్చిన స్టార్ డైరెక్టర్.. ఇక సినిమాలు చేయనంటూ ప్రకటన
నాకు పెద్దగా ప్లాన్స్ లేవు. అలాగే ఇండస్ట్రీలోనే ఉండిపోవాలని అస్సలు లేదు. సినిమాలు తీయాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను
హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో.. అందరి చూపును తనవైపుకు తిప్పుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఆ తర్వాత కమల్ హాసన్ తో తీసిన "విక్రమ్" తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ప్రస్తుతం తలపతి విజయ్ తో లియో అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ క్వింటెన్ టరెంటీనోలా తాను కూడా 10 సినిమాలు చేసిన తర్వాత ఫిల్మ్ మేకింగ్ చేయనని పేర్కొన్నాడు. లోకేశ్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళ ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు షాకయ్యారు.
"నాకు పెద్దగా ప్లాన్స్ లేవు. అలాగే ఇండస్ట్రీలోనే ఉండిపోవాలని అస్సలు లేదు. సినిమాలు తీయాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలు పెట్టి.. పూర్తిగా పట్టు వచ్చాక వృత్తిగా స్వీకరించాను. 10 సినిమాలు తీశాక.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా" అని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు. ఒక సినిమా తీయడం అంటే అంత తేలిక కాదు. గుర్తింపు వచ్చేలా సినిమా తీయాలంటే చాలా విషయాలపై దృష్టి పెట్టాలి. నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. నాకు అలా సహకరించి, నాతో పనిచేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు. 10 సినిమాలు ఎల్ సీయూలో వస్తాయో లేదో చూద్దామని లోకేశ్ తెలిపారు. ఇక రెండోసారి లియో సినిమా ద్వారా విజయ్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు లోకేశ్.