‘మహర్షి’కి కూడా లీక్ బెడద తప్పలేదు!

టాలీవుడ్ కి ఈమధ్య పైరసీ తో పాటు లీకుల బెడద వెంటాడుతోంది. చిన్న సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు లీక్ అవ్వడం విశేషం. క్రేజీ కాంబినేషన్స్ తో [more]

Update: 2018-12-27 08:42 GMT

టాలీవుడ్ కి ఈమధ్య పైరసీ తో పాటు లీకుల బెడద వెంటాడుతోంది. చిన్న సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు లీక్ అవ్వడం విశేషం. క్రేజీ కాంబినేషన్స్ తో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు లీకుకు గురి అవుతున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కొన్ని సీన్స్ బయటికి రావడం..’అరవింద సమేత’ లో కీలక ఫైట్ సీన్ లీక్ అవ్వడం..’గీత గోవిందం’ సినిమా నుంచి కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలు..‘ట్యాక్సీవాలా’ సినిమా సినిమా మొత్తం లీక్ అవ్వడం తో టాలీవుడ్ మొత్తం అలెర్ట్ అయింది. అయినా కానీ లీకులు ఆగడంలేదు.

మహర్షికి కూడా….

రీసెంట్ గా మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’కి కూడా ఈ లీక్ బెడద తప్పలేదని సమాచారం. ఈచిత్రంలో ఓ సాంగ్ బిట్ ఆన్ లైన్లోకి వచ్చేసినట్లు సమాచారం. మరి ఇది ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ టీం మొత్తం అలెర్ట్ అవ్వడంతో ఆ సాంగ్ ను ఆన్ లైన్ నుండి తీసేస్తున్నట్టు సమాచారం. అయితే మరి దీని గురించి ఎక్కడా లీక్ అయినట్టు ప్రచారం జరగలేదు. కానీ లీక్ అయిందని అంటున్నారు.

ముందుగా అలెర్ట్ అయి….

ముందుగా అలెర్ట్ అవ్వడంతో ఎటువంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. దాంతో చిత్ర దర్శక నిర్మాతలు యూనిట్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఎడిటింగ్ రూంలో భద్రతను పెంచి..సెల్ ఫోన్స్ ని అనుమతించట్లేదట. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా జనవరి లో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మహేష్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది.

Tags:    

Similar News