ఓవర్సీస్ లో మహేష్ ఇంత వీక్ గా ఉన్నారా..?

మహేష్ బాబుది అలాంటి ఇలాంటి క్రేజ్ కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లికి కెరీర్ లో ఒక్క బిగ్గెస్ట్ హిట్ లేకపోయినా మహర్షి సినిమా బిజినెస్ వీర లెవల్ [more]

Update: 2019-04-02 09:48 GMT

మహేష్ బాబుది అలాంటి ఇలాంటి క్రేజ్ కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లికి కెరీర్ లో ఒక్క బిగ్గెస్ట్ హిట్ లేకపోయినా మహర్షి సినిమా బిజినెస్ వీర లెవల్ లో జరుగుతుంది. ఇప్పటికే 100 కోట్లకి పైగానే మహర్షి థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోకపోయినా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ వారు 11 కోట్లకి దక్కించుకున్నారని… ఇదంతా కేవలం మహేష్ క్రేజ్ వల్లే జరిగింది అంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ అహోఓహో అంటూ మహర్షి బిజినెస్ పై గొప్పలు పోతున్నారు. కానీ ఓవర్సీస్ లో మాత్రం మహేష్ క్రేజ్ నడవడం లేదు. మహర్షి ఓవర్సీస్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదట.

వెనకడుగు వేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్

మహేష్ బాబు కి ఓవర్సీస్ లో అంతగా మార్కెట్ లేదు. కొరటాల దర్శకుడిగా ఉండడంతో భరత్ అనే నేనుకి మంచి బిజినెస్ ఓవర్సీస్ లో జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మహర్షిని భారీ ధరకు కొనడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదట. మహర్షి సినిమా టాక్ బాగుంటే.. ఓవర్సీస్ కలెక్షన్స్ కుమ్మెయ్యడం ఖాయమే, టాక్ తేడా కొట్టిందో భారీ నష్టాలను బయర్లు చవి చూడడం కూడా ఖాయమే. కనీసం భరత్ అనే నేను సినిమాకి వచ్చిన ధర వచ్చినా చాలని ఇప్పుడు మహర్షి నిర్మాతలు చూస్తున్నారట. కానీ ఆ అమౌంట్ పెట్టేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవడం వలనే ఇంకా మహర్షి ఓవర్సీస్ డీల్ క్లోజ్ కాలేదంటున్నారు.

Tags:    

Similar News