ఫొటోతోనే పడేశారుగా..!

మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ మహర్షి చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి మూవీని దిల్ రాజుతో పాటు [more]

Update: 2019-03-27 11:13 GMT

మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ మహర్షి చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి మూవీని దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు బడా నిర్మాతలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మహర్షి మూవీ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు మహర్షి ప్రమోషన్స్ ని కూడా పరిగెత్తించాలని ప్లాన్ చేసింది. అందుకే 29 నుండి మహర్షి పాటలు మర్కెట్ లోకి రాబోతున్నాయని విషయాన్ని ఒక చూడచక్కటి పోస్టర్ తో తెలియజేసింది. మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో మహర్షి సాంగ్స్, ఫొటోస్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మహర్షి సాంగ్ రిలీజ్ డేట్ పోస్టర్ బయటికి రావడం, సాంగ్ రిలీజ్ డేట్ చెప్పడంతో తెగ ఆనందిస్తున్నారు.

ముగ్గురూ స్నేహితులుగా…

ఇక మహర్షి సాంగ్ రిలీజ్ పోస్టర్ లో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డేతో పాటు మహేష్ బాబు, మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్న అల్లరి నరేష్ వెనుక వైపు నుండి కనిపిస్తున్నారు. పూజా హెగ్డే, మహేష్, అల్లరి నరేష్ ఎవరి మానాన వారు సముద్రపు అలలు ఆస్వాదిస్తున్నారు. మరి బయటికొచ్చిన మహర్షి పోస్టర్ చూస్తుంటే వారి స్నేహానికి సంబంధించిన సాంగ్ ని మహర్షి టీం వదలబోతుంది అనిపిస్తుంది. మరొక్క రోజు వెయిట్ చేస్తే మహర్షి పాట వినెయ్యొచ్చు. ఇక మహర్షి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ ని మహర్షి కి ఇచ్చాడో కూడా మరొక్క రోజులోనే తేలిపోతుంది.

Tags:    

Similar News