టేబుల్ లాస్ తో రిలీజ్ అవుతున్న మహర్షి..?

ఈ సమ్మర్ కి రిలీజ్ అయ్యే సినిమాల్లో పెద్ద సినిమా మహర్షి ఒక్కటే. మిగిలినవన్నీ మీడియం, లోబడ్జెట్ సినిమాలే. అయితే మహర్షి సినిమా రిలీజ్ డేట్ కూడా [more]

Update: 2019-03-28 14:11 GMT

ఈ సమ్మర్ కి రిలీజ్ అయ్యే సినిమాల్లో పెద్ద సినిమా మహర్షి ఒక్కటే. మిగిలినవన్నీ మీడియం, లోబడ్జెట్ సినిమాలే. అయితే మహర్షి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. మహర్షి సినిమా టేబుల్ లాస్ తో విడుదల కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. దానికి కారణం సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవ్వడమే. ఈ సినిమాకి దాదాపుగా 135 నుంచి 140 కోట్ల ఖర్చు అయిందని నిర్మాత దిల్ రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంత మొత్తం వెనక్కి రావాలంటే చాలా కష్టం. ఇప్పటికి నలభై కోట్లకు పైగా నాన్ థియేటర్ రైట్స్ నుంచి వచ్చింది. ఆంధ్ర ఏరియాను 38 కోట్లకు డీల్ సెట్ అయిందని టాక్. సీడెడ్ వాళ్లకి 15 కోట్లు చెబుతున్నారని టాక్. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన భరత్ అనే నేను సినిమా 13 కోట్లకు సీడెడ్ కు అమ్మితే పది కోట్ల రావడమే కష్టమయింది. అందుకే 15 కోట్లు అంటే సీడెడ్ బయ్యర్స్ ఆలోచిస్తున్నారు.

ఎలా చూసినా కష్టమేనా..?

ఎలాగో నైజాం దిల్ రాజు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సమస్య ఏమీ ఉండదు. ఓవర్సీస్ వాళ్లకి 12 కోట్లు చెబుతున్నారు కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా ఉంటాయి. కర్ణాటక నుంచి పది కోట్ల వరకు ఆశిస్తున్నారు. రెస్టాఫ్ ఇండియా ఓ ఐదు కోట్లు పలుకుతుందని అంచనా. ఈ 135 నుంచి 140 కొట్లలో మహేష్ రెమ్యూనరేషన్ కూడా ఉంది. మహేష్ తన రెమ్యూనిరేషన్ తగ్గించకపోతే ఫ్యూచర్ లో ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు తగ్గిపోతారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత బడ్జెట్ అవ్వడానికి రీషూట్స్ కూడా కారణం. మరోపక్క ఈ సినిమాపై మహేష్, దిల్ రాజు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు కానీ టీం విషయంలో భయపడుతున్నారు. సినిమా రన్ టైం 3 గంటలు వచ్చిందంట. మూడు గంటలు సినిమా అంటే టాక్ అద్భుతంగా ఉంటే తప్ప జనాలు సినిమా చూడటానికి థియేటర్స్ కి కూడా రారు.

Tags:    

Similar News