మహర్షికి అంత వస్తుందంటారా..?

మహేష్ బాబు – కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను వంటి హిట్ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన [more]

Update: 2019-05-07 06:42 GMT

మహేష్ బాబు – కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను వంటి హిట్ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా మహర్షి. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగిందని సమాచారం. అందులోనూ మహేష్ సినిమాలకు హిట్స్, ఫ్లాప్స్ తో పనిలేకుండా బిజినెస్ జరగడం చూస్తూనే ఉన్నాం. ఇక మహర్షి విషయంలో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మొత్తంగా చూస్తే.. ఏరియాలవారీగా, ఓవర్సీస్, కర్ణాటక, ఇతర ప్రాంతాలు, శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కులు అన్నీ కలిసి మహర్షి బిజినెస్ 150 కోట్ల వరకు జరిగింది. ఇక మహర్షి సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం బిజినెస్ రూపంలో వెనక్కి వచ్చింది. కానీ ఈ సినిమా నిర్మాతలైన అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీలు మాత్రం లాభాలు రాలేదంటున్నారు. మరి మహర్షికి హిట్ టాక్ పడితేనే మహర్షి బయ్యర్లు బయటపడతారు. మహర్షి హిట్ అయ్యి 120 కోట్ల షేర్ తెస్తేనే మహర్షి బయ్యర్లు ఒడ్డునపడేది. ఇక సినిమా విడులయ్యాక మరో రెండు నెలలు పాటు భారీ బడ్జెట్ సినిమాలేవీ లేకపోవడం మాత్రం మహర్షికి కలిసొచ్చే అంశం. ఏరియాలవారీగా మహర్షి బిజినెస్ వివరాలు.

 

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
నైజాం 24.00
సీడెడ్ 12.60
కృష్ణా 6.00
గుంటూరు 7.70
ఈస్ట్ గోదావరి 7.20
వెస్ట్ గోదావరి 6.00
నెల్లూరు 2.90
ఉత్తరాంధ్ర 9 60
ఇతర ప్రాంతాలు 1.70
ఓవర్ సీస్ 14.00
కర్ణాటక 8.30
మొత్తం 100 కోట్లు
శాటిలైట్ 16.50
డిజిటల్ రైట్స్ 11.00
హిందీ రైట్స్ 20 కోట్లు
మ్యూజిక్ 2.50
ఫైనల్ గా 150 కోట్లు
Tags:    

Similar News