దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న మహేష్ 'మహర్షి' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై దిల్ రాజు మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఎడాది దిల్ రాజుకి సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. మహేష్ గత చిత్రం 'భరత్ అనే నేను' ఓవర్సీస్ లో 3.5 మిలియన్ల డాలర్లు వసూల్ చేసి మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాను కొన్న బయర్స్ కు పెద్దగా లాభాలు ఏమి మిగల్లేదట. దానికి కారణం ఈ సినిమా భారీ రేట్స్ కి అమ్ముడవటమే.
భారీ రెట్ చెబుతున్న నిర్మాతలు
అయితే 'మహర్షి' విషయంలో కూడా అదే చేస్తున్నాడట దిల్ రాజు. ఈ సినిమా హిందీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే. దాంతో దిల్ రాజు ఈ సినిమాను ఎలాగైనా ఎక్కువ రేట్ కి అమ్మాలని చూస్తున్నాడు. అయితే అక్కడి బయ్యర్లు రూ.16 కోట్లు పెట్టి హక్కులు దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నిర్మాతలు ఆ నెంబర్ ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చేస్తే ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో లాభాలు అందుకోవాలంటే సినిమా సూపర్ హిట్ అవ్వాలి. లేదంటే సినిమాను కొన్న బయ్యర్లకు నష్టాలు తప్పవు. 'భరత్ అనే నేను' కన్న ఈ సినిమా పెద్ద హిట్ అయితేనే బయ్యర్లు సేఫ్ జోన్ కి వెళ్తారు. లేకపోతే కష్టమే అని అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. మరి మహేష్ స్టామినాకు ఇది పెద్ద పరీక్షలా మారనుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశముంది.