మొత్తానికి మహేష్ ఒపుకున్నాడుగా..!
ఒక్క తెలుగు సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కైనా వస్తుందా? కానీ సందీప్ రెడ్డి వంగకి వచ్చింది. తెలుగులో అర్జున్ [more]
ఒక్క తెలుగు సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కైనా వస్తుందా? కానీ సందీప్ రెడ్డి వంగకి వచ్చింది. తెలుగులో అర్జున్ [more]
ఒక్క తెలుగు సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కైనా వస్తుందా? కానీ సందీప్ రెడ్డి వంగకి వచ్చింది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి రీమేక్ ను తీస్తున్నాడు. బాలీవుడ్ మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తుంది.
ఈ సినిమా తరువాత సందీప్ మహేష్ తో ఓ సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అర్జున్ రెడ్డి సినిమా తర్వాతే సందీప్ మహేష్ తో సినిమా చేయాలి. మహేష్ కు కథలు వినిపించినా అవేవీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి చెప్పిన కథ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పోలీస్ స్టోరీనా..?
సందీప్.. మహేష్ కోసం పోలీస్ స్టోరీని తయారు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నిజమే అంటున్నారు మహేష్ సన్నిహితులు. ప్రస్తుతం మహేష్ మహర్షి చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. దీని తరువాత సందీప్ తో ఉండబోతుంది. ఎంత లేదన్న కచ్చితంగా వచ్చే ఏడాది దాకా సందీప్ ఆగాల్సిందే. ఏదైమైనా మంచి ఛాన్స్ కొట్టేసాడు సందీప్.