దేశభక్తి నేపథ్యంలో మహేష్ బాబు సినిమా..!

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు కాస్త డిఫరెంట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడితో కలిసి మహేష్ తన 26వ సినిమాని [more]

Update: 2019-05-18 07:29 GMT

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు కాస్త డిఫరెంట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడితో కలిసి మహేష్ తన 26వ సినిమాని జూన్ నుండి పట్టాలెక్కించబోతున్నాడు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత మహేష్ బాబు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సుకుమార్ ని సైడ్ చేసిన మహేష్ బాబు మరో దర్శకుడు సందీప్ వంగాతోనూ కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే దాదాపుగా మహేష్ 27వ సినిమా పరశురంతోనే ఉండబోతుందని స్పష్టత వచ్చినట్లే. ఇప్పటికే స్టోరీ లైన్ వినిపించిన పరశురామ్, మహేష్ కోసం కథని తయారు చేస్తున్నాడు. తాజాగా పరశురామ్ – మహేష్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కథ మీద ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కఠిన సమస్యపైనే కథ

ప్ర‌స్తుతం దేశం ఎదుర్కుంటున్న ఓ క‌ఠిన‌మైన స‌మ‌స్య చుట్టూ ఈ సినిమా క‌థ సాగ‌బోతోంద‌ట‌. అలాంటి సీరియస్ కథకు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ని జోడించి కథను కాస్త ఫన్నీగా నడిపించే విధంగా పరశురామ్.. మహేష్ కోసం కథను రెడీ చేస్తున్నాడట. ఇప్పటివరకు లో, మీడియం కథలతోనే సినిమాలు చేసిన ఓరశురాం మొదటిసారిగా మహేష్ బాబు కోసం పెద్ద కాన్వాస్‌లో క‌థ‌ని త‌యారు చేసుకున్నాడట. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి స్టైల్‌లోనే సాగుతుంద‌ని, కాక‌పోతే ఈసారి దేశం ఎదుర్కుంటున్న ఓ స‌మ‌స్య‌కి ఈ సినిమా అద్దం ప‌ట్ట‌బోతోంద‌ని అంటున్నారు. మరి ఈ మధ్యన మహేష్ బాబు కథలోని బలాన్ని చూసే సినిమాలును ఎంచుకుంటున్నాడు . అందుకే పూర్తి స్క్రిప్ట్ తోనే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళుతున్నాడు. ఇక స్క్రిప్ట్ లో తేడా వస్తే ఆ సినిమానే పక్కన పెట్టేస్తున్నాడంటే మహేష్ ఆలోచనలో ఎంతగా మార్పొచ్చిందో తెలుస్తుంది.

Tags:    

Similar News