డైరెక్టర్లకు మహేష్ బాబు కొత్త రూల్

సాధారణంగా హీరోలు కథ విన్నాక పూర్తి కథ ఉంటేనే సినిమా చేస్తారు. లేకపోతే చేయరు. కానీ కొంతమంది హీరోలు దర్శకులకి ఉన్న ట్రాక్‌ రికార్డ్‌ చూసి లేదా [more]

Update: 2019-01-26 09:00 GMT

సాధారణంగా హీరోలు కథ విన్నాక పూర్తి కథ ఉంటేనే సినిమా చేస్తారు. లేకపోతే చేయరు. కానీ కొంతమంది హీరోలు దర్శకులకి ఉన్న ట్రాక్‌ రికార్డ్‌ చూసి లేదా అతనితో ఇంతకుముందు పని చేసిన అనుభవాన్ని గుర్తుంచుకుని మరో చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలానే మహేష్ బాబు ఇద్దరు దర్శకులకి అవకాశం ఇచ్చి ఫెయిల్ అయ్యాడు. మహేష్ బాబు – వెంకీని పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకంతో ‘బ్రహ్మోత్సవం’ చేసాడు. అది డిజాస్టర్ అయింది. అలానే మురుగదాస్‌ ట్రాక్‌ రికార్డ్‌ ని నమ్మి ‘స్పైడర్‌’ చేస్తే అతను నిలువునా ముంచాడు.

స్క్రిప్ట్ పూర్తయ్యాకే సినిమా

అందుకే ఇలా కాదని పూర్తిగా కథను నమ్ముకుందాం అని డిసైడ్ అయ్యాడు. బౌండ్‌ స్క్రిప్ట్‌ లేకుండా ఏ సినిమా స్టార్ట్‌ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చాడు. అదే ‘మహర్షి’ సినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి కారణం. ఈ సినిమాపై వంశీ పైడిపల్లి దాదాపు ఏడాదిపైనే వర్క్ చేసాడు. అలానే మహర్షి తరువాత చేసే సుకుమార్ సినిమాకు సంబంధించి బౌండ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యాకే సినిమా మొదలు పెడదామని తేల్చేసాడు. తొందర పడి ఏ సినిమాను స్టార్ట్ చేయకూడని డిసైడ్ అయ్యాడు. బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎవరు ముందుకు వస్తే వారితో సినిమా చేస్తా అంటున్నాడు మహేష్.

Tags:    

Similar News