Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి మహేష్.. గుంటూరు కారం షూటింగ్ ఏంటి..?

గుంటూరు కారం రిలీజ్ కి మరో రెండు వారలు మాత్రమే ఉంది. అయితే మహేష్ ఈ సమయంలో వెకేషన్ కి వెళ్తున్నారు.;

Update: 2023-12-29 05:10 GMT
Mahesh Babu, Guntur Kaaram, Sreeleela, Mahesh Babu off to dubai vacation and what about Guntur Kaaram, guntur movie news, movie updates, movie news

Mahesh Babu off to dubai vacation

  • whatsapp icon

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'గుంటూరు కారం' సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ కి మరో రెండు వారలు మాత్రమే ఉంది. కానీ ఈ మూవీ షూటింగ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని సాంగ్స్ ని షూట్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే ఇటీవల మహేష్ బాబు, శ్రీలీల పై ఒక మాస్ సాంగ్ ని షూట్ చేసారు.

అలాగే బ్యాలన్స్ ఉన్న కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ని కూడా షూట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ గురువారంతో మొత్తం షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టినట్లు వార్తలు వినిపించాయి. అయితే మహేష్ బాబు నేడు షూటింగ్ కోసమంటూ దుబాయ్ బయలు దేరారు. అంటే గుంటూరు కారం షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదా..? అసలు విషయం ఏంటంటే.. మహేష్ దుబాయ్ వెళ్తుంది యాడ్ షూట్ కోసమట.
అక్కడ యాడ్ షూట్ తో పాటు ఒక చిన్న ఫ్యామిలీ వెకేషన్ ని కూడా ప్లాన్ చేసారు మహేష్ బాబు. అందుకనే నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ బయలుదేరారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ దగ్గర మహేష్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో మహేష్ స్టైలిష్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Tags:    

Similar News