బన్నీని వదిలి మహేష్ తో త్రివిక్రమ్

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన వచ్చి ఆరు నెలలైనా ఆ కాంబో ఇంకా [more]

Update: 2019-04-03 08:28 GMT

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన వచ్చి ఆరు నెలలైనా ఆ కాంబో ఇంకా పట్టాలెక్కలేదు. బన్నీ – త్రివిక్రమ్ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ మీద నమ్మకం లేక సుకుమార్ వైపు చూస్తున్నాడని.. సుకుమార్ తో ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడదామా అన్నట్లుగా బన్నీ చూస్తున్నాడనని అంటున్నారు. ఈలోపు త్రివిక్రమ్.. మహేష్ తో పని చేయబోతున్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. మహేష్ తో త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసాడు.

మహేష్ తో యాడ్ షూట్

అయితే మహేష్ తో గత కొంతకాలంగా సినిమాలు చెయ్యకపోయినా చాలా యాడ్ షూట్స్ చేస్తున్నాడు. ఆ రకంగా త్రివిక్రమ్ – మహేష్ కలిసే పనిచేస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చెయ్యడం లేదు కానీ ఒక యాడ్ ఫిలింని ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ స్టార్స్ తో కొన్ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ డైరెక్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఆ యాడ్ ఒక యాప్‌కి సంబంధించినదని, ఈనెల 10 నుండి ఆ యాడ్ షూటింగ్ జ‌ర‌గ‌బోతోందట. ప్రస్తుతం మహేష్ మ‌హ‌ర్షి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఈ యాడ్ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.

Tags:    

Similar News