Guntur Kaaram : ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' చూసిన మహేష్.. కానీ నిరాశగా..
తన ఫేవరెట్ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి 'గుంటూరు కారం' చూసిన మహేష్ బాబు. కానీ నిరాశలో..;
Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మాస్ మసాలా చిత్రం 'గుంటూరు కారం' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ నుంచి రిలీజైన మహేష్ మాస్ లుక్స్, సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో వరల్డ్ వైడ్ గా చిత్రం రికార్డు స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్స్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
మహేష్ అభిమానులు సైతం ఈ సినిమా పై, త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తున్నారు. సినిమా కోసం మహేష్ ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ పై కనిపిస్తుందని, కానీ త్రివిక్రమ్ మాత్రం తన కథ, మాటల్లో ఎటువంటి ఎమోషన్ లేకుండా తెరకెక్కించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ అందించిన థమన్ పై అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ మూవీని చూసేందుకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ కి వచ్చారు. అయితే థియేటర్ లో మహేష్ చాలా డల్ గా నిరాశలో కనిపించారు. మహేష్ మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించేది. కానీ నేడు థియేటర్ లో మహేష్ డల్ గా ఉండడంతో.. అభిమానులు సైతం తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ని ఇలా చూడలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గుంటూరు కారం కథ విషయానికి వస్తే.. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో కథలని మళ్ళీ రీమేక్ చేసి చూపించారని అంటున్నారు. అమ్మ కోసం కొడుకు చేసే ఫైట్ గుంటూరు కారం. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక్కటే సినిమాకి ప్లస్ పాయింట్ అంటూ చెబుతున్నారు.