ఈ వీక్ ఎలిమినేషన్ చాలా కష్టం

మొన్న ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో మహేష్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా హౌస్ లో మిగిలింది ఏడుగురు సభ్యులు మాత్రమే. ఫైనల్ దగ్గర పడే కొద్దీ ఏడుగురికి [more]

Update: 2019-10-15 06:22 GMT

మొన్న ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో మహేష్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా హౌస్ లో మిగిలింది ఏడుగురు సభ్యులు మాత్రమే. ఫైనల్ దగ్గర పడే కొద్దీ ఏడుగురికి తమపై తమకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. దాంతో నిన్న నామినేషన్ ప్రాసెస్ కొంచెం వేడిగా సాగింది. నిన్న బిగ్ బాస్ ర్యాంకింగ్‌ టాస్క్‌ ఇచ్చి మొదటి మూడు ర్యాంక్‌లలో వున్న వాళ్లు నామినేట్‌ అవరు అని బిగ్‌బాస్‌ చెప్పేసరికి ఆ ర్యాంకుల కోసం హౌస్ మేట్స్ బేరసారాలు చేయడం స్టార్ట్ చేశారు.

సభ్యులకు ర్యాంకులు….

హౌస్ మేట్స్ కి వచ్చిన చీటీలు ప్రకారం తమ స్థానాల్లో నించున్నారు. మొదటి స్థానంలో బాబా భాస్కర్, రెండు స్థానంలో రాహుల్, మూడో స్థానంలో వరుణ్, నాలుగో స్థానంలో అలీ, ఐదో స్థానంలో జ్యోతి, ఆరులో వితిక, ఏడులో శ్రీముఖి ఉన్నారు. అయితే రెండో స్థానం కోసం ఏడవ స్థానంలో వున్న శ్రీముఖి రాహుల్ ని అడగగా అతను చాలా హీట్ ఆర్గుమెంట్ తరువాత కుదరదు అని చెప్పేశాడు. ఆ తరువాత అలీ రెజా కూల్‌గా అడిగినపుడు రాహుల్‌ అతనికి తన ప్లేస్‌ ఇచ్చేశాడు.

అందరూ నామినేట్…..

ఇక మూడో స్థానంలో వున్న వరుణ్ ప్లేస్ గురించి పెద్ద రచ్చ జరిగింది. వరుణ్ కోసం మూడో స్థానాన్ని వదిలేసుకున్న జ్యోతి అదే స్థానాన్ని అతను వితికకి ఇచ్చేసరికి వాదనకి దిగింది. అక్కడ స్టార్ట్ అయిన రచ్చ వరుణ్ ఆమెను వెక్కిరిస్తూ కొన్ని వెకిలి చేష్టలు చేసి తన ఇమేజ్‌ని మరోసారి భార్య కోసం డ్యామేజ్‌ చేసుకున్నాడు. ఇక శివ జ్యోతి మూడవ స్థానం నుంచి కదలకపోవడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని నామినేట్ చేశాడు. దాంతో ఈ వారం నామినేషన్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. మరి ఎవరికి ఈ వీక్ తక్కువ ఓటింగ్స్ వచ్చి ఎలిమినేట్ అవుతారో చూడాలి.

 

Tags:    

Similar News