అదరగొడుతున్న మజిలీ బిజినెస్..!

సమంత క్రేజ్, శివ నిర్మాణ గత సినిమా హిట్ కావడం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గోపిసుందర్ మ్యూజిక్, చైతు క్యూట్ లుక్స్ కొత్త హీరోయిన్స్ దివ్యంశ లుక్స్ [more]

Update: 2019-04-02 08:35 GMT

సమంత క్రేజ్, శివ నిర్మాణ గత సినిమా హిట్ కావడం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గోపిసుందర్ మ్యూజిక్, చైతు క్యూట్ లుక్స్ కొత్త హీరోయిన్స్ దివ్యంశ లుక్స్ అన్నీ కలిపి మజిలీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ శుక్రవారం ఉగాది కానుకగా విడుదల కాబోతున్న మజిలీ సినిమాకి సెన్సార్ కూడా యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక నాగ చైతన్యకి గత సినిమాల ఫ్లాప్ తో సంబంధం లేకుండా మజిలీ సినిమా బిజినెస్ జరిగింది. కారణం సమంత క్రేజ్ అంటూ సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి నిజంగానే సమంత క్రేజ్ తోనే మజిలీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఏ లెవల్లో జరిగిందో మీరే చూడండి.

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం 6 కోట్లు
సీడెడ్ 2.50
అర్బన్ ఏరియాస్ 1.98
ఈస్ట్ గోదావరి 1.44
కృష్ణ 1.28
గుంటూరు 1.62
వెస్ట్ గోదావరి 1.12
నెల్లూరు 0.70
ఏపీ అండ్ టీఎస్ 16.64
ఇతర ప్రాంతాలు 1.50
ఓవర్సీస్ 3.00
వరల్డ్ వైడ్ 21.14 కోట్లు

Tags:    

Similar News