గోపి హ్యాండ్ ఇస్తే.. థమన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు..!
నాగ చైతన్య – సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా విడుదలకు పట్టుమని పదిహేను రోజుల టైం కూడా లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ [more]
నాగ చైతన్య – సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా విడుదలకు పట్టుమని పదిహేను రోజుల టైం కూడా లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ [more]
నాగ చైతన్య – సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా విడుదలకు పట్టుమని పదిహేను రోజుల టైం కూడా లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్న మజిలీ టీంకి మజిలీ మ్యూజిక్ డైరెక్టర్ షాకిచ్చాడు. మజిలీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా గీత గోవిందంతో ఫుల్ క్రేజ్ సంపాదించిన గోపి సుందర్ ని తీసుకున్నాడు శివ నిర్వాణ. అయితే గోపి సుందర్ మజిలీ మ్యూజిక్ ని బాగానే అందించినా.. చివరి నిమిషంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దగ్గర హ్యాండ్ ఇచ్చాడట. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి కలిపి రెమ్యునరేషన్ తీసుకున్న గోపి సుందర్ ఇప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకుండా తప్పుకున్నాడట.
థమన్ ను తీసుకొని
అయితే విడుదలకు అసలే సమయం లేకపోవడంతో.. మజిలీ టీం వెంటనే ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని సంప్రదించగా.. చివరికి నేపథ్య సంగీతానికి బెస్ట్ ఆప్షన్ అయిన థమన్ ని మజిలీ కోసం తీసుకొచ్చారట. థమన్ మ్యూజిక్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో థమన్ కి మంచి పేరుంది. ఇక ప్రస్తుతం థమన్ కి ఎక్ట్ర్సా రెమ్యునరేషన్ సమర్పించుకుని మరీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేపిస్తుందట మజిలీ బృందం. మరి మంచి లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిన మజిలీకి స్మూత్ గా సాగే నేపధ్య సంగీతం చాలా అవసరం.
సమంత కూడా చెప్పడంతో
అందుకే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత స్పెషల్ గా థమన్ కి ఫోన్ చేసి మరీ.. మజిలీకి మ్యూజిక్ బాగా ఇవ్వమని కోరిందట. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మజిలీని నిలబెట్టే బాధ్యత నీదే అని కూడా చెపింది. మరి టాప్ హీరోయిన్ సమంత చెప్పడం థమన్ చెయ్యకపోవడం ఉంటుందా. అందుకే మజిలీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మరీ ఆర్ ఆర్ ఇస్తున్నాడట థమన్. అలా మజిలీకి గోపి హ్యాండ్ ఇస్తే… థమన్ మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చాడు.