మళ్లీ పెళ్లి చేసుకుంటున్న మలైకా
బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే తల్లయిన మలైకా అరోరా యువ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నారనేది. మలైకా అరోరా భర్త [more]
బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే తల్లయిన మలైకా అరోరా యువ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నారనేది. మలైకా అరోరా భర్త [more]
బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే తల్లయిన మలైకా అరోరా యువ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నారనేది. మలైకా అరోరా భర్త అర్బాజ్‌తో విడాకులు తీసుకున్న నాటి నుంచి అర్జున్‌తో ఆమె సహ జీవనం చేస్తుంది. అయితే అర్జున్ ఇంట్లో ఏవో ఇబ్బందులు ఉండటంతో ఇప్పుటివరకు ఎక్కడ ఈ న్యూస్ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక ఒకడిని విడిచి మరొకరు ఉండలేక పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయి బయట ఇద్దరూ కలిసే తిరిగేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇంట్లో వారు ఒప్పుకుంటారా..?
అర్జున్ కంటే మలైకా ఏకంగా పదిహేనేళ్లు పెద్దది. ఏప్రిల్ 19న వీరి పెళ్లి జరగబోతుందని… అది కూడా కొద్దిమంది స్నేహితులు, బాగా క్లోజ్ అయిన సినిమా వాళ్ల మధ్యన చాలా సింపిల్ గా జరగనుంది. మరి వీరి పెళ్లికి అర్జున్ కపూర్ వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారో లేదో తెలియాలి. త్వరలోనే బాలీవుడ్ లో పెళ్లి బాజా మోగబోతుంది.