విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నటుడు రవి అరెస్ట్
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నటుడు రవి అరెస్ట్;
కేరళ సినీ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలక్కాడ్ లో ఇద్దరు విద్యార్థినుల ఎదుట శ్రీజిత్ రవి తన ప్రైవేట్ పార్ట్స్ ను ప్రదర్శించాడన్న ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. శ్రీజిత్ రవిపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శ్రీజిత్ రవి కారు నుంచి దిగి రోడ్డుపై వెళుతున్న విద్యార్థినులకు మర్మాంగాన్ని చూపాడని పోలీసులు తెలిపారు. 46 ఏళ్ల ఈ మలయాళ నటుడు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2016లోనూ ఇదే తరహాలో తన వికృత నైజాన్ని చాటుకున్నాడు. పాలక్కాడ్ లో 14 మంది విద్యార్థినులకు తన పురుషాంగాన్ని ప్రదర్శించాడు. అప్పట్లో అతడిని అరెస్ట్ చేయగా, బెయిల్ పై బయటికి వచ్చాడు.
తాజాగా త్రిసూర్‌లో బాలలపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. జూలై 4న జరిగిన ఒక సంఘటనపై త్రిసూర్ వెస్ట్ పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లు సమాచారం. 9 మరియు 14 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ల ముందు సోమవారం నాడు త్రిసూర్‌లోని SN పార్క్, అయ్యంతోల్ వద్ద ఈ పాడు పని చేసినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు CCTV ఫుటేజీ పరిశీలించి ఆ వ్యక్తి శ్రీజిత్ అని నిర్ధారించారు. సహాయ పాత్రలు, విలన్ పాత్రలలో కనిపిస్తూ ఉంటాడు. గోధ, రామలీల.. అనేక ఇతర మలయాళ చిత్రాలలోనూ, కొన్ని తమిళ చిత్రాలలో కూడా కనిపించాడు.