ఘనంగా మంచు మనోజ్ - మౌనికల వివాహం
ఈ వేడుకకు సమీప బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు, టీజీ వెంకటేశ్, కోదంరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రానీ..
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ - భూమా మౌనికల వివాహం.. మార్చి 3వ తేదీ రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో రాత్రి 8.30 గంటల సమయంలో మనోజ్- మౌనికను వివామాడాడు. ఈ వేడుకకు సమీప బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు, టీజీ వెంకటేశ్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రానీ, దేవినేని అవినాశ్ తదితరలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి సమయంలో మౌనిక.. మోహన్ బాబు ని పట్టుకుని భావోద్వేగానికి లోనైన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. కాగా వీరిద్దరికీ ఇది రెండో వివాహమే.
2015లో మనోజ్ కు ప్రణతిరెడ్డి అనే యువతితో వివాహం జరిగింది. నాలుగేళ్ల తర్వాత 2019లో పరస్పర అంగీకారంతో.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక దివంగత భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డికి కూడా గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. గతేడాది వినాయకచవితి సందర్భంగా మనోజ్-మౌనిక ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ దీనిపై వాళ్లిద్దరితో పాటు ఇరు కుటుంబాలు స్పందించలేదు. నిన్న ఉదయం మనోజ్ అధికారికంగా తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం వీరి పెళ్లిఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.