థ్యాంక్స్ జగన్ గారూ
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసీన జీవోపై మెగాస్టార్ చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారు.;
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసీన జీవోపై మెగాస్టార్ చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు కలిగించే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించినందుకు కూడా జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం చిన్న నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు.
చిన్న నిర్మాతలకు....
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కనిష్టంగా రూ20 లు, గరిష్టంగా 250లు ఫిక్స్ చేశారు. ఇది చిత్ర పరిశ్రమకు అనుకూలించే నిర్ణయమని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవల చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్, రాజమౌళి వంటి వారు జగన్ ను కలసి టాలీవుడ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నానితో పాటు కమిటీ సభ్యులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.