మహేష్ బాబు పెళ్లిరోజు....ఫ్లైట్ లోనే చిరంజీవి?
మహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.;
ఈరోజు మహేష్ బాబు పెళ్లిరోజు. మహేష్ బాబు, నమ్రత ల పదిహేడో పెళ్లిరోజు. మహేష్ బాబు ముఖ్యమంత్రి జగన్ తో సినిమా రంగ సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక విమానంలో తోటి సినీ ప్రముఖలతో కలసి విజయవాడ బయలుదేరారు. అయితే మహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శుభాకాంక్షలు....
మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకేను తెప్పించి విమానంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబుకు చిరంజీవి, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబుకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోను చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అయింది.