రైతులందరికీ నా సెల్యూట్.. పెరట్లో ఆనపకాయ చూసి మురిసిపోయిన చిరంజీవి

తన ఫేవరెట్ అవుట్ డోర్ యాక్టివిటీ గార్డెనింగ్ అని చెప్తూ.. చేతిలో తాజా పొట్లకాయలను పట్టుకుని రైతులకు సెల్యూట్ చేశారు. ప్రకృతి ఎంత గొప్పదో చూడండి..

Update: 2021-12-24 06:08 GMT

నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగాా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రైతులనుద్దేశించి ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. కొద్ది నెలల క్రితం ఆయన తమ పెరట్లో ఆనపకాయ విత్తనాలను నాటగా.. అది పెరిగి పెద్దదై.. ఇప్పుడు కాయలు కూడా కాస్తున్నాయట. తాను నాటిన విత్తనాల ద్వారా మొక్కలు వచ్చి.. వాటి తీగలకు కాసిన ఆనపకాయలను చూసి చిరంజీవి ఆనందంలో మునిగిపోయారు. చిరంజీవి పోస్ట్ చేసిన ఆ సెల్ఫీ వీడియోలో ఆయన తెల్లటి చొక్కా ధరించి.. గార్డెన్ లో నడుస్తూ కనిపించారు.

ప్రకృతికి రుణపడి ఉండాలి

తన ఫేవరెట్ అవుట్ డోర్ యాక్టివిటీ గార్డెనింగ్ అని చెప్తూ.. చేతిలో తాజా ఆనపకాయలను పట్టుకుని రైతులకు సెల్యూట్ చేశారు. ప్రకృతి ఎంత గొప్పదో చూడండి.. మనం చిన్న విత్తనాన్ని వేస్తే.. ఇంత పెద్ద కూరగాయలను మనకి అందించింది. ప్రకృతికి మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అని చిరంజీవి పేర్కొన్నారు. మార్కెట్లో కొన్నవాటికంటే..ఇలా సొంతంగా పండించిన కూరగాయలు ఎంతో రుచిగా ఉంటాయని చెప్పుకొచ్చారు. " పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి! అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కి నా సెల్యూట్ " అంటూ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.






Tags:    

Similar News