దేవి ప్లేస్ లోకి అలా మిక్కీ వచ్చాడు
వాల్మీకి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిన ప్లేస్ లోకి మిక్కిజె మేయర్ రావడంపై అప్పట్లో ఫిలింనగర్ సాక్షిగా చాలానే గుసగుసలు వినిపించాయి. దేవిశ్రీకి [more]
వాల్మీకి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిన ప్లేస్ లోకి మిక్కిజె మేయర్ రావడంపై అప్పట్లో ఫిలింనగర్ సాక్షిగా చాలానే గుసగుసలు వినిపించాయి. దేవిశ్రీకి [more]
వాల్మీకి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిన ప్లేస్ లోకి మిక్కిజె మేయర్ రావడంపై అప్పట్లో ఫిలింనగర్ సాక్షిగా చాలానే గుసగుసలు వినిపించాయి. దేవిశ్రీకి దర్శకుడు హరీష్ శంకర్ కి మధ్యలో వచ్చిన విభేదాల కారణంగానే వాల్మీకి సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. మరి అంతలా ప్రచారం జరగడానికి వాల్మీకి ఫస్ట్ లుక్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ పేరే వేశారు. తాజాగా దేవిశ్రీ ప్లేస్ లోకి మిక్కీ రావడం పై వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.
రూల్స్ నో బ్రేక్…..
వాల్మీకి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని మేము మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకె చేసుకుని దేవిశ్రీకి చెప్పకుండా అతనెలాగైనా ఒప్పుకుంటాడనే ఉద్దేశ్యంతో దేవిశ్రీ అనుమతి లేకుండా మేము వాల్మీకి పోస్టర్ మీద దేవిశ్రీ పేరు వేశామని తర్వాత వీలుచూసుకుని వాల్మీకి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని అడగడానికి వెళ్లి అడిగామని అనుకోకుండా వాల్మీకి విషయంలో ఓ సమస్య తలెత్తిందని చెప్పిన హరీష్. ఆ సమస్య ఏమిటో కూడా వివరించాడు. వాల్మీకి సినిమాలో ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేయాలని అనుకంటున్నామని చెప్పగానే దేవిశ్రీ. తాను మ్యూజిక్ చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కానీ నేను రీమిక్స్ పాటలను నా ఆల్బమ్ లో చెయ్యకూడదనేది తన పాలసీ అని వాల్మీకి ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించాడని చెప్పాడు హరీష్. అంతేకాకుండా దేవిశ్రీ పాలసీని బ్రేక్ చెయ్యమని అతనిపై ఒత్తిడి తీసుకురావడం ఇష్టం లేకనే మరో మ్యూజిక్ డైరెక్టర్ ని వెతుకుతుండగా తమకి మిక్కీ జె మేయర్ దొరికాడని చెప్పాడు హరీష్. మరి మిక్కీ జె మేయర్ అందించిన వాల్మీకి మ్యూజిక్ సినిమాలో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.