కండీషన్స్ అప్లై.. మహిళలకు ఉచితంగా 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి'

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో

Update: 2023-09-12 10:17 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మహేష్ బాబు పి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' సక్సెస్ ను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క కనిపించలేదు. అయితే ఈ చిత్రం ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరోయిన్ అనుష్క శెట్టి ధన్యవాదాలు తెలిపారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం పై చూపిస్తున్న ప్రేమకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ చిత్ర బృందం ఓ కొత్త ఆఫర్ ను తెచ్చింది. మహిళల కోసం ఈ గురువారం నాడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో స్పెషల్ మార్నింగ్ షోస్ ను ప్రదర్శించనున్నట్లు అనుష్క తెలిపారు. ఆరోజు మహిళలు వచ్చి సినిమాను చూడాలని కోరారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్స్ దక్కాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ తో పాటే థియేటర్లలోకి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ దాని క్రేజ్ ను తట్టుకుని యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించింది. అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోయినా.. నవీన్ పోలిశెట్టి జనం లోకి సినిమాను తీసుకుని వెళ్ళాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు.



Tags:    

Similar News