చై - సామ్ విడాకులకు కారణం అదేనా ? చైతన్య ఏమంటున్నారు ?

నాగచైతన్య ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ విడాకకులకు కారణం పరోక్షంగా చెప్పారు;

Update: 2021-12-17 05:49 GMT

టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒక జంట నాగ చైతన్య - సమంత. వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరగడం.. ఆ తర్వాత పలు సందర్భాల్లో సమంత తాళికి ఇచ్చిన ప్రాధాన్యతను చూసి.. వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుందనుకున్నారు అంతా. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం.. అందరినీ షాక్ కు గురి చేసింది. విడాకుల ప్రకటన చేసి సుమారు మూడు నెలలు కావస్తున్నా.. ఇంతవరకూ చై - సామ్ విడాకులు ఎందుకు తీసుకుంటున్నారన్నది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఈ విషయంపై ఇప్పటివరకూ ఇద్దరూ స్పందించకపోవడంతో చాలా పుకార్లు షికార్లు చేశాయి.

ఇబ్బంది కలిగించే...
తాజాగా.. నాగచైతన్య ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఆ విషయమే చై - సామ్ విడాకులకు కారణం అయి ఉంటుందని అనుకుంటున్నారు అటు అక్కినేని , ఇటు సమంత అభిమానులు. ఇంతకీ నాగచైతన్య ఏమన్నారంటే.. విభిన్న కథలు, పాత్రలు ఎంచుకుంటూ చైతన్య కెరీర్ లో కొత్త అడుగులు వేస్తున్నారు. లవ్ స్టోరీతో హిట్ కొట్టిన ఈ అక్కినేని హీరోని విభిన్న రకాల పాత్రలు చేయడం గురించి ఆయనను అడిగినప్పుడు ఇలా బదులిచ్చాడు. "నేను అన్ని రకాల పాత్రలకు చేస్తాను. అయితే ఆ పాత్రలు నా కుటుంబాన్ని, మా ప్రతిష్టను ప్రభావితం చేయకూడదు. నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించే పాత్రలను నేను అంగీకరించను" అని చై చెప్పుకొచ్చాడు. ఇది విన్న అభిమానులు, నెటిజన్లు ఈ వ్యాఖ్యలు సామ్ కు కూడా వర్తిస్తాయి కదా అంటూ.. చైతన్య భార్య అయిన సమంత గురించి, ఆమె కెరీర్ లో ఎంచుకుంటున్న పాత్రల గురించి ప్రస్తావిస్తున్నారు.
అదే కారణమని...
సామ్ ఇటీవల కాలంలో బోల్డ్ గా కన్పిస్తూ మరింత గ్లామర్ ను ఒలకబోస్తోంది. సమంతకు సంబంధించి ఆమె కెరీర్ నిర్ణయాలను నాగ చైతన్య, ఆయన కుటుంబం ప్రోత్సహించకపోవడమే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణం అని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా చై చేసిన కామెంట్స్ తో విడాకులకు ముఖ్య కారణం ఇదేనని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. వాళ్ళు విడిపోయే ముందు విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్-2' దీనంతటికీ కారణం అని, అందులో సామ్ తన పాత్ర గురించి కుటుంబ సభ్యులకు ముందుగా చెప్పలేదని, దీంతో విషయం విడాకుల దాకా వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి చై-సామ్ లు విడిపోవడానికి అసలు కారణం ఏమిటో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్తే గానీ.. సస్పెన్స్ వీడేలా లేదు.




Tags:    

Similar News