25 ఎపిసోడ్స్ అన్నారు కానీ.. ఎనిమిదేళ్ళు సాగింది

నాగబాబు ఈటివి లో అదుర్స్ ప్రోగ్రాం కి జేడ్జ్ గా చేస్తున్నప్పుడు… మల్లెమాల ప్రొడ్యూసర్ నాగబాబు తో జబర్దస్త్ అనే కామెడీ షో ప్లాన్ చేస్తున్నామని, ఆ [more]

Update: 2019-11-26 04:47 GMT

నాగబాబు ఈటివి లో అదుర్స్ ప్రోగ్రాం కి జేడ్జ్ గా చేస్తున్నప్పుడు… మల్లెమాల ప్రొడ్యూసర్ నాగబాబు తో జబర్దస్త్ అనే కామెడీ షో ప్లాన్ చేస్తున్నామని, ఆ షో కి మీరు జేడ్జ్ గా రావాలని అడిగినట్లుగా జబర్దస్త్ షో నుండి రీసెంట్ గా వెళ్ళిపోయినా నాగబాబు.. తన జబర్దస్త్ జర్నీ ఎలా మొదలైందో.. ఓ వీడియో రూపంలో చెప్పాడు. అదుర్స్ ప్రోగ్రాం లో జేడ్జ్ గా పనిచేస్తున్నప్పుడు .. ఆ షో మేనేజర్ ఏడు కొండలు ద్వారా తనకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కలిపారని, ఆయనే జబర్దస్త్ షో ని 25 ఎపిసోడ్స్ కని ప్లాన్ చేస్తున్నాం, జేడ్జ్ కింద చెయ్యాలని అడిగారని చెప్పాడు. అలాగే రోజా ని కూడా అడగడంతో.. ఆమె కూడా జబర్దస్త్ షో 25 ఎపిసోడ్స్ కి జేడ్జ్ గా అనుకునే వచ్చిందని.. తర్వాత నేను రోజా రాజకీయాలతో ప్రత్యర్థులుగా మారినా జబర్దస్త్ జేడ్జ్ లుగానే చేశామని చెబుతున్నాడు నాగబాబు.

అయితే జబర్దస్త్ 25 ఎపిసోడ్స్ అనుకున్నది కాస్తా… నిర్విరామంగా ఎనిమిదేళ్లు సక్సెస్ ఫుల్ గా నడిచిందని, జబర్దస్త్ కి అన్ని ఛానల్స్ కన్నా ఎక్కువగా టిఆర్పి రావడంతో… ఇంకా ఇంకా పెంచుకుంటూ పోయారని, అది ఈ టివి అదృష్టమో, శ్యామ్ ప్రసాద్ గారి ఆదృష్టమో, లేదంటే రోజా, నా అదృష్టమో కానీ, జబర్దస్త్ మాత్రం బాగా సక్సెస్ అయ్యి అందరికి పేరొచ్చిందని చెప్పాడు. అదుర్స్ కోసం లక్షలు ఖర్చు చేసినా రాని టిఆర్పీ జబర్దస్త్ కామెడీ షోకు వచ్చినందువల్లనే ఆ షో ఇన్నాళ్లు నడిచిందని చెప్పాడు. అయితే జబర్దస్త్ కాన్సెప్ట్ చెప్పింది మాత్రం డైరెక్టర్ సంజీవ్ అని.. ఆయన దగ్గర ఉన్న ఇద్దరు కుర్రాళ్లు నితిన్- భరత్ అని చెప్పిన నాగబాబు.. నితిన్, భరత్ లే తమ క్రియేటివ్ మైండ్ తో రాను రాను షోను నడిపించే స్థాయికి ఎదిగారని చెప్పాడు. వారు చాలా కష్టపడతారని చెప్పాడు. అయితే నితిన్ – భరత్ మల్లెమాల జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతోనే నాగబాబు కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News