‘మజిలీ’ పోస్టర్ విడుదల…సింప్లి సూపర్బ్

పెళ్లి కి ముందు ఏమో కానీ పెళ్లి తరువాత ఇరగతీసేస్తుంది సమంత. పెళ్లి తరువాత హీరోయిన్స్ గా లైఫ్ ను కొనసాగించడం కష్టం అన్న వాళ్ళ నోళ్లు [more]

;

Update: 2018-12-30 12:13 GMT
Nagachaitanya samantha telugu post telugu news
  • whatsapp icon

పెళ్లి కి ముందు ఏమో కానీ పెళ్లి తరువాత ఇరగతీసేస్తుంది సమంత. పెళ్లి తరువాత హీరోయిన్స్ గా లైఫ్ ను కొనసాగించడం కష్టం అన్న వాళ్ళ నోళ్లు మూపించింది. పెళ్లి తర్వాత వరస విజయాలతో దూసుకుపోతున్న సమంత రీసెంట్ గా తన భర్త నాగ చైతన్య తో కలిసి ఓ సినిమా చేస్తుంది. పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంత తొలిసారిగా నటిస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు ఉదయం చిత్ర బృందం విడుదల చేసింది. ట్విట్టర్ లో నాగ చైతన్య ‘మజిలీ’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. పోస్టర్ చాలా సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది. ఈ పోస్టర్ లో చై అండ్ సామ్ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది. ఇందులో చైతు మాజీ క్రికెటర్ గా, సమంత రైల్వే క్లర్క్ గా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.

Majili cinema telugu post telugu news

దీని పై చైతు స్పందిస్తూ…”ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. సమంత తో ఇది నాది నాలుగో సినిమా. కొత్త ఏడాది లో ఈసినిమా స్టార్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. శివ తో పనిచేయడం నా కల..ఏప్రిల్ లో కలుద్దాం అని ట్వీట్ చేసాడు.ఈ మూవీకి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. చైతు ఈసినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

Tags:    

Similar News