బాలీవుడ్ లో బ్యాన్… సౌత్ లో రెడ్ కార్పెట్..!

బాలీవుడ్ లో నటుడు నానా పాటేకర్ ని దాదాపుగా బ్యాన్ చేసినట్టే. తనుశ్రీ దత్త చేసిన మీటూ ఆరోపణలతో నానా పాటేకర్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు [more]

Update: 2019-05-03 06:45 GMT

బాలీవుడ్ లో నటుడు నానా పాటేకర్ ని దాదాపుగా బ్యాన్ చేసినట్టే. తనుశ్రీ దత్త చేసిన మీటూ ఆరోపణలతో నానా పాటేకర్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపడం లేదు. ఇక నానా పాటేకర్ చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయ్యాక ఆయన్ని తప్పించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో బ్యాన్ అయినా సౌత్ లో మాత్రం ఈ విలక్షణ నటుడికి రెడ్ కార్పెట్ పడుతున్నారు. నానా పాటేకర్ నటనకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. అందుకే సౌత్ దర్శకులు నానా పాటేకర్ ని దృష్టిలో పెట్టుకుని.. ఆయనకు ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో నానా పాటేకర్ కి అల్లు అర్జున్ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ ఒక మంచి బలమైన్ క్యారెక్టర్ రాశాడట.

రెండు తెలుగు సినిమాల్లో

ఇక రానా – సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విరాటపర్వం సినిమాలోనూ నానా పాటేకర్ నటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఎలాంటి ఎమోషన్ అయినా, ఎంత కఠినమైన డైలాగ్ అయినా కేవలం తన నటనతో, తన మాడ్యులేషన్ తో వాటిని మరో స్థాయికి తీసుకెళ్లి ఇంకా అద్భుతంగా చూపించ గల సత్తా ఉన్న నటుడు ఆయన. తెలుగులోనే కాదు నానా పాటేకర్ తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తున్నాడు. గతంలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా కాలాలో నానా పాటేకర్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News