బాలయ్య ముఖ్యమంత్రి కావడం లేదు..!

మహానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారిగా నటిస్తున్న బాలకృష్ణ ఎలాగూ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు. ఇది ఫిక్స్. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయాలు, ఆయన ముఖ్యమంత్రి అవడానికి కలిసొచ్చిన అంశాలు [more]

Update: 2019-02-02 06:23 GMT

మహానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారిగా నటిస్తున్న బాలకృష్ణ ఎలాగూ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు. ఇది ఫిక్స్. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయాలు, ఆయన ముఖ్యమంత్రి అవడానికి కలిసొచ్చిన అంశాలు రాజకీయ నేతలతో ఎన్టీఆర్ సంబంధాలు అన్నీ చూపిస్తారనేది తెలిసిన విషయమే. అయితే బాలకృష్ణ ఈ మహానాయకుడులోనే ముఖ్యమంత్రిగా కాకుండా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడంటూ గత రెండు రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఎప్పటి నుండో బోయపాటితో బాలయ్య చెయ్యబోయే సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంబోతుందని.. 2019 ఎన్నికల టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నందున ఈ సినిమాలో బాలయ్య సీఎంగా కనబడతాడనే సరికి చాలామంది నమ్మేశారు. అయితే ఈ విషయాలు ఆ నోటా ఈ నోటా బాలయ్య సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్న బోయపాటి చెవిన పడ్డాయట.

వాటికి మించి తీస్తానంటున్న బోయపాటి

అసలే వినయ విధేయ రామ ఫ్లాప్ తో ఉన్న బోయపాటి కి ఈ మ్యాటర్ వినబడేసరికి కాస్త కోపం, ఆశ్చర్యం కలిగాయట. అందుకే బాలకృష్ణ గారి సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని మీకెవరు చెప్పారు… అలాంటిదేం లేదు బాలకృష్ణ గారితో నేను గతంలో చేసిన లెజెండ్, సింహా చిత్రాలకు మించి మాస్ మాసాలతోనే ఉంటుందని బోయపాటి సన్నిహితులకు చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి – బాలయ్య కాంబో ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఏదో కథానాయకుడు ఈవెంట్ లో ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకెళుతుందని బాలయ్య చెప్పినా.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎందుకంటే బాలయ్య కథానాయకుడు ఫ్లాప్ టెన్షన్ లో మహానాయకుడు మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. మరోపక్క వినయ విధేయ రామ ప్లాప్ తో బోయపాటి కాస్త టెన్షన్ లో ఉన్నాడు.

Tags:    

Similar News