రూలర్ ఎఫెక్ట్: బాలయ్య తొడ దెబ్బకు కుదేలైన బయ్యర్లు

బాలకృష కెరీర్ లో భారీ డిజాస్టర్స్ ఉన్నాయి, అలాగే భారీ హిట్స్ ఉన్నాయి. తాజాగా రూలర్ బాలయ్య భారీ డిజాస్టర్స్ పక్కన నిల్చుంది. రూలర్ సినిమాతో బాలకృష్ణ [more]

;

Update: 2019-12-24 07:11 GMT

బాలకృష కెరీర్ లో భారీ డిజాస్టర్స్ ఉన్నాయి, అలాగే భారీ హిట్స్ ఉన్నాయి. తాజాగా రూలర్ బాలయ్య భారీ డిజాస్టర్స్ పక్కన నిల్చుంది. రూలర్ సినిమాతో బాలకృష్ణ పరువు పోయింది. బాలయ్య బాబు కేక అంటూ భజన చేసే ఫ్యాన్స్ ని కూడా రూలర్ సినిమా అయోమయంలో పడేసింది. ఓ పరమవీర చక్ర,ఓ వీరభద్ర, మహారథి సినిమాల సరసన రూలర్ కూడా చేరింది. రూలర్ సినిమా ఎంత రొటీన్ గా ఉన్నప్పటికీ.. మాస్ కి ఎక్కేసి బిసి సెంటర్స్ లో ఆడేస్తుంది అనుకున్నాడు దర్శకుడు. అసలు బాలకృష్ణ ఈ కథని ఎలా యాక్సెప్ట్ చేసాడో అర్ధం కావడం లేదు. పూరి పైసా వసూల్ ఓ రకంగా మెరుగ్గా ఉంది రూలర్ చూస్తుంటే.

మరి రూలర్ సినిమాతో బయ్యర్లుగోల పెట్టేస్తున్నారు. తాజాగా బోయపాటి సినిమాకి బాలకృష్ణ కోసం మిర్యాల రవీందర్ రెడ్డి 70 కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మరి రూలర్ దెబ్బకి 70 కోట్లు కుదరదు… ఓ 50 పెట్టగలుగుతానని బోయపాటి కి నిర్మాత చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్. స్క్రిప్ట్ ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా కుదించమని చెబుతున్నాడట. రూలర్ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా దరిదాపుల్లోకి రావడం లేదు రూలర్ కలెక్షన్స్. అందుకే బోయపాటి – బాలయ్య సినిమాకి బడ్జెట్ కటింగ్ చేసే యోచనలో నిర్మాత ఉన్నట్టుగా టాక్.

Tags:    

Similar News