గ్యాంగ్ లీడర్ ప్లాప్ లిస్ట్ లోకే

నాని – విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం గత నెల 13 న రిలీజ్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. [more]

;

Update: 2019-10-02 07:45 GMT
గ్యాంగ్ లీడర్
  • whatsapp icon

నాని – విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం గత నెల 13 న రిలీజ్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సస్పెన్స్ మరియు కామెడీ తో ఎంటర్టైనర్ చేసిన నాని ఈ సినిమాతో హిట్ అందుకోలేకపోయాడు. కార్తికేయ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసినట్టే. ఎందుకంటే ఈరోజు నుంచి సైరా హావా కొనసాగనుంది.

యావరేజ్ గా నిలిచింది…

గ్యాంగ్ లీడర్ మొత్తంగా 28 కోట్లకి బిజినెస్ జరుపుకుని 30 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. కానీ 17 రోజుల్లో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ ను .. 23 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఒక మంచి హిట్ సినిమా నాని చేతి వరకు వచ్చి జారిపోయిందనే అనుకుంటున్నారు. ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తున్నా ‘వి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు.

 

Tags:    

Similar News